Andhra Pradesh Rain Alert: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశంజిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి… కోస్తా దక్షిణ సముద్ర ప్రాంతంతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది… ఈ నేపధ్యంలో ఒంగోలులో భారీ వర్షం కురిసింది…
కొత్తపట్నం సముద్ర తీరంలో అలలు, ఈదురు గాలుల తాకిడికి లంగరు వేసిన ఓ బోటు కొట్టుకుపోయింది… సముద్రంలో కొట్టుకుపోయిన బోటు బోల్తా కొట్టడంతో బోటులో ఉన్న రింగు వలకు నష్టం వాటిల్లింది… రెండు కిలో మీటర్ల మేర బోటు కొట్టుకుపోవడాన్ని గుర్తించిన స్థానిక మత్స్యకారులు అతికష్టం మీద బోటును ఒడ్డుకు చేర్చారు… బోటును ఒడ్డుకు చేర్చేందుకు ట్రాక్టర్లతో తాడు కట్టి లాగారు… ఈ ప్రమాదంలో బోటుకు డామేజ్ జరిగింది… అలాగే 10 లక్షల విలువైన రింగు వల సగభాగం ఛిద్రమైంది… బోటు ఇంజన్ కూడా చెడిపోయింది… దీంతో మొత్తం 20 లక్షల నష్టం వాటిల్లిందని చెబుతున్నారు… ఈ రింగు వలపై ఆధారపడి 30 మత్స్యకార కుటుంబాలకు చెందిన 70 మంది మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… సముద్రంలో నెలకొన్న అలజడి కారణంగా వీచిన భారీ గాలులకు ఈ ప్రమాదం జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు… బోటు, వల పూర్తిగా దెబ్బతిన్నందున ప్రభుత్వం కల్పించుకుని మత్స్యకార కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని వేడుకుంటున్నారు.
Also Read: పాన్ ఇండియా సినిమాలతో చరిత్ర సృష్టించడానికి రెడీ అవుతున్న టాలీవుడ్ హీరోలు..