పల్నాడు జిల్లాలో పెద్ద పులులు కలకలం సృష్టించాయి. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు పులులు బయటకు వచ్చి పల్నాడు జిల్లాలో సంచరిస్తున్నాయట. ఇదే విషయాన్ని వినుకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి సయ్యద్ హుస్సేన్ ప్రకటించారు. అడవి నుంచి పారిపోయిన రెండు పులు గ్రామాల్లో ప్రవేశించాయని తెలిపారాయన. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి రెండు పులులు బయటకు వచ్చాయని, దుర్గి మండలంతో పాటు బొల్లాపల్లి, కారంపూడి మండలాల గ్రామాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కాగా, పులుల గురించి భయపడాల్సిన పనిలేదని అటవీఅధికారులు భరోసా ఇస్తున్నారు. అవి మ్యాన్ ఈటర్స్ కాదని, వాటి ప్రశాంతతకు భంగం కలిగించొద్దని ప్రజలకు సూచించారు. అడవి నుంచి బయటకు వచ్చిన పులులు సమీప గ్రామాలకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఫారెస్ట్ అధికారులు. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ ప్రకటించారు. ఒంటరిగా వెళ్ల కూడదని, పరిసరాలను గమనిస్తుండాలని సూచించారు. కాగా, శ్రీశైలం-సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 73 పులులు ఉన్నాయని తెలిపారు ఎఫ్ఆర్ఓ సయ్యద్ హుస్సేన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..