AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్‌‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు

|

Nov 18, 2021 | 11:38 AM

అల్పపీడనం ఎఫెక్ట్‌‌తో ఏపీలో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు..ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి.

AP Weather: అల్పపీడనం ఎఫెక్ట్‌‌.. ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో 2 రోజులు స్కూళ్లకు సెలవులు
Ap Rains
Follow us on

అల్పపీడనం ఎఫెక్ట్‌‌తో ఏపీలో వరుణుడు తన ప్రతాపం చూపుతున్నాడు..ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, కృష్ణా, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. రానున్న రెండ్రోజులు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఐఎండీ హెచ్చరించింది.

కడప జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు కలెక్టర్‌. ఇవాళ, రేపు రెండ్రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు.

అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి..ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి.నియోజకవర్గ పరిధిలోని వందల ఎకరాలలో వరి,శనగ, పచ్చిమిర్చి,పత్తి, పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.  చిత్తూరు జిల్లాపై అల్పపీడన ప్రభావం పడుడోంది..26 మండలాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి..ఈ వర్షాలకు జిల్లాలోని 82 చెరువులకు గండ్లు పడ్డాయి..మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో అనంతపురం జిల్లాలోని చిత్రావతి నదికి వరద నీరు పోటెత్తింది.

మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది వాతావరణశాఖ. తీరం వెంబడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వైపు కదులుతోందని.. ఏపీ, ఒడిశా మధ్య తీరానికి సమీపించే అవకాశముందని ప్రకటించింది.

Also Read: Viral Photo: 3 నల్ల త్రాచులు ఒకేసారి ఒకేచోట పడగలు విప్పితే ఎట్టా ఉంటుందో తెలుసా..?

Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…