
అమరావతి, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ టెట్ 2025 ఫలితాలు శుక్రవారం (జనవరి 9) విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. టెట్ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2,71,692 దరఖాస్తు చేసుకోగా.. అందులో దాదాపు 2.4లక్షల మంది మంది హాజరయ్యారు. పరీక్షల అనంతరం ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల చేయగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను స్వీకరించింది. వీటిని పరిశీలించిన అనంతరం తుది కీ రూపొందించారు. దీంతో తాజాగా ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను కూడా విద్యాశాఖ విడుదల చేసింది. టెట్ పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ యూజర్ నేమ్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి టెట్ మార్కులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ టెట్ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా టెట్ పలితాల్లో 97,560 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. అంటే మొత్తం 2,71,692 మందిలో 39.27 శాతం మంది మాత్రమే అర్హత ఉత్తీర్ణత సాధించారన్నమాట. గతంతో పోల్చితే టెట్ ఉత్తీర్ణత ఈసారి భారీగా తగ్గింది. అయితే ఈసారి టెట్ పరీక్షలు రాసిన ఇన్‌సర్వీస్ టీచర్లలో 47.82 శాతం మంది అర్హత సాధించడం గమనార్హం. ఈ పరీక్షకు మొత్తం 31,886 మంది ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు హాజరయ్యారు. వీరిలో 15,239 మంది ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణులైనారు. టెట్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు 9552300009 వాట్సప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
ఓసీ అభ్యర్ధులకు 90 మార్కులు, బీసీ అభ్యర్ధులకు 75 మార్కులు, ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులకు 60 మార్కులు.. అపై సాధిస్తే టెట్ లో అర్హత సాధించినట్లే. టెట్ మార్కులకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. డీఎస్సీ రాయాలంటే అభ్యర్ధులు తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించవల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.