AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: కాలేజీల బంద్‌.. యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం

తమకు 8 వేల కోట్ల రూపాయిల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఇంజినీరింగ్ సహా, ఇతర వృత్తివిద్యా కాలేజీలు బంద్‌కు పిలునిచ్చాయి. వెంటనే 12 వందల కోట్లు విడుదల చేయాలని కళాశాలల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

AP, Telangana News Live: కాలేజీల బంద్‌.. యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం
NEET PG 2025 Entrance Exam
Subhash Goud
| Edited By: |

Updated on: Sep 15, 2025 | 9:56 PM

Share

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు.. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణా రావు చర్చలు జరిపారు. చర్చలకు సంబంధించిన కీలక విషయాలను భట్టి విక్రమార్కను వెల్లడించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Sep 2025 09:53 PM (IST)

    శివాలయంలో గుప్తనిధుల వేట.. పోలీసులకు ఫిర్యాదు

    నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. స్థానిక శివాలయం గోపురంను కూలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆలయ గోపురంను కూలగొట్టి లోపలికి దూరడానికి ప్రయత్నం. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు.

  • 15 Sep 2025 09:47 PM (IST)

    కాలేజీల బంద్‌.. యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం

    తెలంగాణ రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకపోవడంతో నిరసనగా వృత్తి విద్యా కాలేజీలు ఈ రోజు నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

  • 15 Sep 2025 09:43 PM (IST)

    రాష్ట్రానికి 41,170 మెట్రిక్‌ టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు

    ఆంధ్రప్రదేశ్‌కు 41,170 మెట్రిక్‌టన్నుల యూరియాను కేంద్రం కేటాయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం (సెప్టెంబర్ 16) యూరియా రాష్ట్రానికి చేరుకుంటుందని, ఈ మేరకు ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

  • 15 Sep 2025 09:21 PM (IST)

    ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ AR అనురాధ రిటైర్‌మెంట్‌.. తదుపరి ఛైర్మన్‌ ఎవరో?

    ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి నుంచి AR అనురాధ రిటైర్మెంట్. అనూరాధ పదవీకాలం పూర్తయినందున రిటైర్మెంట్ అయినట్టు ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం.

  • 15 Sep 2025 09:11 PM (IST)

    మెదక్‌ కోర్టు చారిత్రక తీర్పు.. ఏడేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలుశిక్ష

    మెదక్‌ కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. పోక్సో కేసులో దోషిగా ఉన్న థలారి మోహన్‌ అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2022లో శంకరంపేట మండలంలో ఏడేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. జైలు శిక్షతోపాటు రూ.5వేలు జరిమానా కోర్టు విధించింది. బాధిత కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

  • 15 Sep 2025 09:08 PM (IST)

    గొర్రెల పంపిణీ స్కామ్‌లో ముగిసిన ED విచారణ

    తెలంగాణ గొర్రెల పంపిణీ స్కామ్‌ కేసులో ఈడీ విచారణ ఈ రోజు ముగిసింది. బాధితుల వాంగ్మూలాన్ని సోమవారం అధికారులు నమోదు చేసుకున్నారు. గొర్రెలు, మేకలను రైతుల నుంచి ఎవరు తీసుకెళ్లారు? నగదు చెల్లింపులు ఎలా జరిగాయనే దానిపూ ఈడీ అధికారులు ఆరా తీయగా.. బాధితులు చెప్పిన విషయాలను అధికారులు నమోదు చేసుకున్నారు.

  • 15 Sep 2025 08:33 PM (IST)

    రైతన్నకు తీపికబురు.. తీరనున్న యూరియా కష్టాలు!

    తెలంగాణలో తీరనున్న యూరియా కష్టాలు !! ఈ వారంలో తెలంగాణకి అదనంగా మరో 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా. ఉత్తర్వులను జారీ చేసిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ. మరో 5 ఓడల నుంచి తెలంగాణకు యూరియా కేటాయింపులు. సెప్టెంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో లక్షా 4 వేల టన్నులు సరఫరా.

  • 15 Sep 2025 08:31 PM (IST)

    కనబడని కోడి పుంజు.. RMP డాక్టర్‌ ఇంట్లో పోలీసుల పోదాలు! చివరికి..

    భద్రాద్రి కొత్తగూడెం దమ్మపేటలో ఆర్.ఎం.పి డాక్టర్ ఇంటిలో ఆంధ్ర ప్రదేశ్ చింతలపూడి పోలీసుల సోదాలు చేశారు. చింతలపూడి మండలంలో పందెం పుంజు దొంగిలించాడనే అనుమానంతో ఆంధ్ర పోలీసులు సోదాలు చేశారు. ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి సి.సి.కెమెరాలు పగులగొట్టి, ఇల్లు మొత్తం చిందరవందర చేసారని బాధితుల ఆరోపణ. పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

  • 15 Sep 2025 07:54 PM (IST)

    కోడిని మింగిన కొండ చిలువ.. నిద్రపోని ఊరి జనాలు!

    అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రెడ్డివారి పల్లి గ్రామంలో 8 అడుగుల కొండచిలువ స్థానికంగా కలకలం రేపింది. దాకూరు నరసింహులు అనే రైతు ఇంటి వెనక కొండచిలువ ఓ కోడిని మింగింది. దీంతో నరసింహులు చుట్టుపక్కల వారిని పిలిచి కొండచిలువను కొట్టి చెరువులో పడేశాడు.

  • 15 Sep 2025 07:52 PM (IST)

    అఫ్జల్ సాగర్ పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వాలి

    హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ వద్ద నిన్న ఇద్దరు వ్యక్తులు అఫ్జల్ సాగర్ మురికి కాలువలో గల్లంతైన ఘటనపై నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఫెరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. అఫ్జల్ సాగర్‌లో నివసిస్తున్న పేదవారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టివ్వాలని గతంలోనే అనేక సార్లు అధికారులను కోరాను. ఇప్పుడయినా వెంటనే వారికి ఇళ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

  • 15 Sep 2025 07:49 PM (IST)

    టాక్స్ ఎగవేతకు నయా స్కెచ్‌.. ఒకే నంబర్‌ ప్లేట్‌తో 2 బైక్‌లు!

    ఒకే నంబర్‌తో నడుస్తున్న రెండు జెనరేటర్ వెహికిల్‌లను ఖైరతాబాద్ రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. AP 28 BU 7316 నంబర్‌తో వాహనాల సర్టిఫికెట్లు క్రియేట్ చేసి టాక్స్ ఎగవేసి తీరుగుతున్న రెండు వాహనాలను ఖైరతాబాద్ రవాణా శాఖ అధికారులు గుర్తించారు. అసలైన నెంబర్ కల వాహనం ఇంకా ఆచూకీ తెలియదు. ఇలాంటి ఒకే నంబర్‌తో రెండు, మూడు వాహనాలు తిరుగుతున్నట్టు గుర్తిసే రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.

  • 15 Sep 2025 07:46 PM (IST)

    గొర్రెల పెంపకం స్కామ్‌లో ఈడీ దూకుడు

    తెలంగాణ గొర్రెల పెంపకం స్కామ్ కేసులో బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న ఈడీ అధికారులు. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కి చేరుకున్న గొర్రెల పెంపకం స్కామ్ బాధితులు.

  • 15 Sep 2025 07:10 PM (IST)

    కిడ్నాప్ చేసి… ఆపై హత్య! ఆ యవ్వారమే కారణమా?

    గుంటూరులో పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నుండి కనపడకుండా పోయిన సీతమ్మ కాలనీ 2వ లైన్ కి చెందిన వేముల రామాంజనేయులు (38). భర్త కనపడక పోవడంతో నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన భార్య వేముల శివ పార్వతి. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఈ రోజు ఉదయం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు. అదే కాలనీలో ఉండే బండారు కొండయ్యపై అనుమానం వ్యక్తం చేసిన రామాంజనేయుల కుటుంబ సభ్యులు. బండారు కొండయ్యను అదుపులో తీసుకొని విచారించిన నగరం పాలెం పోలీసులు.

    రామాంజనేయులను హత్య చేసినట్టు ఒప్పుకున్న నిందితులు. అద్దంకి శివారు ప్రాంతంలో హైవే దగ్గర నీటిలో రామాంజనేయులు మృతదేహం పడేసినట్లుగా నిందితులు వెల్లడించారు. మృతదేహం కోసం పోలీసుల ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. నీటి కుంటలో మృతదేహం లభ్యమైంది. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

  • 15 Sep 2025 07:04 PM (IST)

    తాడేపల్లి హైవేపై ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి సూసైడ్

    గుంటూరులోని తాడేపల్లి హైవేపై వ్యక్తి ఉరి వేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. హైవే కి మద్యలో ఉన్న పోలీసు పోస్టుకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై డేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.

  • 15 Sep 2025 07:02 PM (IST)

    మరోమారు భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

    ఏపీలో మరోమారు భారీగా ఐఏఎస్‌ల బదిలీలు చేపట్టారు. ఫైబర్ నెట్ ఎండిగా కృష్ణాజిల్లా జెసి గీతాంజలి శర్మ, మౌలిక సౌకర్యాలు పెట్టుబడుల శాఖ ఎండి గా పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ ఏపీ ఎస్‌బిసిఎల్ ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.

  • 15 Sep 2025 07:00 PM (IST)

    దూసుకుపోతున్న స్త్రీ శక్తీ పధకం.. రోజుకు 20 లక్షల మంది మహిళ ప్రయాణం

    స్త్రీ శక్తీ పధకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 5.94 కోట్ల మంది మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ప్రయాణించారు. ఇప్పటివరకు జీరో ఫేర్ ట్రావెల్ ద్వారా 223.96 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం. ప్రస్తుతం రోజుకు సగటున 19.52 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుంటే, గతంలో ఇది 9.47 లక్షల మంది ప్రయాణించే వారు.

  • 15 Sep 2025 06:38 PM (IST)

    నేటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్

    • ఈ రోజు నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్.
    • ఈ మేరకు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఆశా.
    • హాస్పిటల్ కి 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు తెలిపిన ఆశా
    • వారంలోగా సమస్య పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన ఆశా..
    • ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓ కి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు..
  • 15 Sep 2025 05:49 PM (IST)

    బిగ్ బ్రేకింగ్.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై KTR పరువు నష్టం దావా!

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఆయన ఈ దావా వేశారు. ఈ దావాలో, పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన కేసులో కేటీఅర్ డిమాండ్ చేసిన పరిహారాలు బండి సంజయ్ నుండి బేషరతుగా బహిరంగ క్షమాపణ కోరారు. పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించకుండా లేదా ప్రసారం చేయకుండా నిందితులను నిరోధించే ఉత్తర్వులు ఇవ్వాలని విజ్జప్తి చేశారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మీడియా పోర్టల్‌ల నుండి పరువు నష్టం కలిగించే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించాలని కోరారు.

  • 15 Sep 2025 05:33 PM (IST)

    BMW కారు ప్రమాదం.. కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి మృతి!

    • కారు ప్రమాదంలో చనిపోయిన కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్తోజ్ సింగ్
    • ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం
    • బైక్‌పై వస్తున్న నవ్తోజ్ సింగ్ దంపతులను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు
    • ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవ్తోజ్ సింగ్ భార్య
    • కారు నడిపి మహిళను గగనీప్రీత్ గా గుర్తింపు
    • ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారును, నవ్తోజ్ సింగ్ బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
    • ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు
  • 15 Sep 2025 04:50 PM (IST)

    మేథా స్కూల్ డ్రగ్స్ దందాలో వెలుగులోకి మరో దారుణం

    • మేథా స్కూల్ డ్రగ్స్ లో బయటపడ్డ మరో దారుణం
    • పరారీలో ఫార్ములా ను అమ్మిన గురువా రెడ్డి
    • డ్రగ్స్ దందా కు పిల్లల స్కూల్ ఫీజు లే పెట్టుబడి పెట్టిన జయప్రకాష్ గౌడ్
    • డ్రగ్స్ ఫార్ములా కోసం పిల్లలు స్కూల్ ఫీజ్ రూపంలో వచ్చిన డబ్బుతో గురువా రెడ్డి నుంచి ఫార్ములా కొన్న జయప్రకాష్
    • 2 లక్షలకు అల్ప్రాజలం ఫార్ములాను జయప్రకాష్ కు అమ్మిన గురువారెడ్డి
  • 15 Sep 2025 04:35 PM (IST)

    రైతు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఆ తర్వాత జరిగిందిదే!

    ఏపీలోని అనంతపురం కనేకల్ మండలం గరుడచెడు గ్రామ సమీపంలో రైతు కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో గౌరమ్మ అనే మహిళ కూలీ మృతి చెందింది. మరో నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. తుంబిగానూరు గ్రామానికి చెందిన ఏడుగురు రైతు కూలీలు బెదురుకుంతం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గరుడచెడు గ్రామ సమీపంలోకి రాగానే మలుపు దగ్గర ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను హుటాహుటిన కనేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

  • 15 Sep 2025 04:32 PM (IST)

    చదవాలా..? వంటచేయాలా? ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్ధుల కష్టాలు..

    తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వంట సిబ్బంది సమ్మె చేస్తున్నారు. సిబ్బంది సమ్మెతో కొమురంభీం జిల్లా ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు వంట సిబ్బందిగా మారి వంటలు చేసుకుంటున్నారు. పుస్తకాలు పెన్నులు పట్టాల్సిన చేత్తో గరిటెలు తిప్పుతున్న విద్యార్థినిలు. చదువుకోవాలా లేక‌ హస్టల్లో వంటలు చేయాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.

  • 15 Sep 2025 04:28 PM (IST)

    ఆర్టీసీ బస్సులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు! ఎక్కడంటే

    ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్ వెళుతున్న ఆర్టీసీ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇచ్చోడ మండలం జాతీయ రహదారి 44 పై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన బస్ డ్రైవర్.. రోడ్డు పక్కన నిలిపి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించేశాడు. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు.

  • 15 Sep 2025 04:26 PM (IST)

    బట్టల షాపులో మహిళా దొంగల ముఠా అరెస్ట్..

    నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని ఓ బట్టల షాపులో కస్టమర్ల ముసుగులో బట్టలు కొట్టేసి పారిపోయి ఐదుగురు మహిళలను కడెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులు ఆంద్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మహిళలుగా గుర్తింపు. మహిళా దొంగల ముఠాను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్న పోలీసులు.

  • 15 Sep 2025 04:24 PM (IST)

    నిర్మల్ జిల్లా తానూర్ వాగు వద్ద చిరుత పులి సంచారం.. గ్రామస్థులు గజగజ

    నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి) గ్రామ సమీపంలో వాగు వద్ద చిరుత సంచారం. పంట పొలంలో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు భయందోళన చెందుతున్నారు. చిరుతను గమనించిన ధర్మన్న అనే వ్యక్తి తన ఫోన్ లో ఫోటో తీసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవి శాఖ అధికారులు అధికారులు చిరుతపై నిఘా పెట్టాలని గ్రామస్తులు కోరారు.

  • 15 Sep 2025 04:22 PM (IST)

    మంచిర్యాల ఏకలవ్య స్కూల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సందడి

    మంచిర్యాల పట్టణంలోని ఏకలవ్య ఆశ్రమంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి, శిక్షకులకు సర్టిఫికెట్లను అందజేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.

  • 15 Sep 2025 04:17 PM (IST)

    ORRపై పల్టీలు కొట్టిన కారు.. ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి!

    ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బోల్తా పడి ఇన్ఫోసిస్ ఉద్యోగిని మృతి చెందింది. ప్రమాదంలో ఇన్ఫోసిస్ టెకీ సౌమ్య రెడ్డి (25) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ఓఆర్ఆర్‌పై వీరు ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. కారులో సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతురాలు సౌమ్య రెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలగా పోలీసులు గుర్తించారు.

  • 15 Sep 2025 04:07 PM (IST)

    అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్‌ నేతలు

    తెలంగాణ బీఆర్‌ఎస్‌ నేతలు అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. ఎమ్మెల్యేల వివరణ స్పీకర్‌ మాకు పంపి సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీకి మా సమాధానాలు ఇచ్చామని అన్నారు. ఇప్పటికీ పార్టీ మారలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెబుతున్నారు.. సీఎంను కలిసినప్పుడు వేసింది కాంగ్రెస్‌ కండువా అనుకోలేదంటున్నారని, స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని గెలిపించాలని పోచారం మాట్లాడారని, రాహుల్‌ గాంధీని పోచారం ఎందుకు కలిశారు? అని ఆయన ప్రశ్నించారు.

  • 15 Sep 2025 03:45 PM (IST)

    బోయిన్‌పల్లి మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ కేసు

    బోయిన్‌పల్లి మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ కేసు ప్రధాన సూత్రధారి జయప్రకాష్‌తో పాటు.. ఉదయ్, సాయి, మురళి రిమాండ్‌కు తరలించారు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్ములా కొని..జయప్రకాశ్‌ గౌడ్‌ అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం గురువారెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన కోసం ఈగల్ టీమ్ గాలింపు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే బోయిన్‌పల్లిలోని మేధా పాఠశాల సీజ్ చేసి మేధా స్కూల్ అనుమతులు రద్దు చేసింది విద్యాశాఖ. విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

  • 15 Sep 2025 03:37 PM (IST)

    ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత

    మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. జిల్లా కేంద్రం సమీపంలోని తిరుమల దేవునిగుట్ట, వీరన్న పేట ప్రాంతంలో రెండున్నర నెలలుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది.

    చిరుత కోసం అధికారులు చాలాసార్లు బోన్లు పెట్టారు. డ్రోన్లతో నిఘా కూడా పెట్టారు.. అయినా ఫలితం లేదు. ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులోనే చిరుత చిక్కింది. దీంతో జిల్లా కేంద్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

  • 15 Sep 2025 03:12 PM (IST)

    బకాయిల చెల్లింపులపై సానుకూలంగా ఉన్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

    ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు సంబంధించిన బకాయిల చెల్లింపులపై సానుకూలంగా ఉన్నామని, విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా సమ్మెను విమరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాలేజీలను యధావిధిగా నడిపించాలని సీఎం సూచించారు. కాలేజీల విద్యా వ్యవస్థ నాణ్యాతా ప్రమాణాలపై కేసీఆర్‌ వేసిన విజిలెన్స్‌ మిషన్‌ రిపోర్ట్‌ను సైతం ఆయన పరిశీలించారు.

  • 15 Sep 2025 03:02 PM (IST)

    సీఎం రేవంత్‌రెడ్డితో ముగిసిన మంత్రుల భేటీ

    ఫీజు రియంబర్స్‌మెంట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో సమావేశం ముగిసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చ జరిగింది. కాసేపట్లో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం జరగనుంది.

  • 15 Sep 2025 02:55 PM (IST)

    బస్తాపై రూ.800 సబ్సిడీ: చంద్రబాబు

    ఎరువుల సరఫరాలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సిందని, మైక్రో న్యూట్రియంట్స్‌ సరఫరా చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్ర బాబు అన్నారు. ఇప్పడు యూరియా వాడకపోతే బస్తాపై రైతుకి రూ.800 సబ్సిడీ ఇస్తామన్నారు. యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని, రబీ నాటికి ఈ క్రాప్‌ పూర్తిచేసి ఆధార్‌ ఆధారంగా ఎరువులు సరఫరా చేయాలన్నారు చంద్రబాబు.

  • 15 Sep 2025 02:40 PM (IST)

    మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటి ముట్టడి

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ ఇంటిని అంగన్‌వాడీ ఉద్యోగులు ముట్టడించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆందోళనకారుల డిమాండ్ డిమాండ్‌ చేశారు. మంత్రి ఇంటి ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు అంగన్‌వాడీ ఉద్యోగులు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అలాగే కనీస వేతనం అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • 15 Sep 2025 02:26 PM (IST)

    తెలంగాణలో ప్రైవేట్‌ ఆస్పత్రుల కీలక నిర్ణయం

    తెలంగాణ ప్రైవేట్‌ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నాయి. రూ.1,400 కోట్ల బకాయిలు ఉండటంతో వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.

  • 15 Sep 2025 01:30 PM (IST)

    75వ వసంతంలోకి ప్రధాని మోదీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సెప్టెంబర్ 17, 2025తో 75వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 17న మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ప్రారంభించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. గుజరాత్‌లోని మెహ్సానాలో జన్మించిన ప్రధాని మోదీ.. అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా.. కనీసం రెండు పూర్తి పదవీకాలాలను పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా.. సరికొత్త చరిత్రను లిఖించారు.

  • 15 Sep 2025 01:20 PM (IST)

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులకు నష్టం- కేటీఆర్‌

    ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోందన్నారు మాజీమంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో రూ. 20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం చెల్లించామని.. అందులో కాంగ్రెస్‌ హయాంలోని బకాయిలు కూడా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ తీరుతో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

  • 15 Sep 2025 01:15 PM (IST)

    ప్రైవేట్‌ స్కూల్‌ గోడ కూలి విద్యార్థి మృతి

    కర్నూలు కవ్వాడి వీధిలో విషాదం జరిగింది. ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో గోడ కూలడంతో విద్యార్థి మృతి చెందాడు.ఈ ఘటనపై మంత్రి టీజీ భరత్‌ విచారణకు ఆదేశించారు. గోడ కూలడంతో ఒకటో తరగతి విద్యార్థి రాఖీబ్‌(5) మృతి చెందాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

  • 15 Sep 2025 12:59 PM (IST)

    యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు

    UPI పద్దతిలో మీరు పేమెంట్లు చేస్తున్నారా?మీ కోసం ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. UPI పేమెంట్ల పరిమితిని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- NPCI పెంచింది. పర్సన్‌ టూ మర్చంట్ కేటగిరిలో చెల్లింపుల పరిమితి పెంచారు. పెంచిన చెల్లింపుల పరిమితి ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. బీమా, మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు, రవాణాకు సంబంధించిన UPI చెల్లింపుల పరిమితిని ఇప్పటిదాకా ఉన్న 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. UPI ద్వారా క్రెడిట్‌ కార్డు చెల్లింపుల పరిమితి ఇప్పటిదాకా ఉన్న 5 లక్షల రూపాయల వరకే ఉంది. దీన్ని మరో లక్ష పొడిగించారు. అంటే క్రెడిట్‌ కార్డులకు UPI ద్వారా 6 లక్షలకు చెల్లింపులు చేయొచ్చు.

  • 15 Sep 2025 12:50 PM (IST)

    సీఎం రేవంత్‌తో భట్టి, శ్రీధర్‌బాబు భేటీ

    ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబులతో భేటీ అయ్యారు. బకాయిలు చెల్లించాలని కాలేజీ యాజమాన్యాల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరనుంది. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై ప్రకటన చేయనుంది ప్రభుత్వం.

  • 15 Sep 2025 12:31 PM (IST)

    యూరియా కోసం రోడ్డుపైకి..

    కరీంనగర్‌: దుర్షెడు దగ్గర బీఆర్‌ఎస్ ఆందోళన చేపట్టింది. యూరియా సరఫరా చేయాలని రోడ్డెక్కిన BRS శ్రేణులు. ఈ ఆందోళనలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మరోవైపు యూరియా కొరతకు నిరసనగా బతుకమ్మ ఆడారు మహిళలు. యూరియా సంచుల చుట్టూ బతుకమ్మ ఆడారు మహిళలు.

  • 15 Sep 2025 11:50 AM (IST)

    మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితా విడుదల

    మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. మెగా డీఎస్సీ హామీని నెరవేర్చాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ఫైల్ పై తన మొదటి సంతకం చేశారు.

  • 15 Sep 2025 11:27 AM (IST)

    గాలింపు చర్యలు

    హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో కురిసిన వర్షానికి నాలాలో కొట్టుకుపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ కలిసి.. మాంగర్‌బస్తీ నాలాలో గాలింపు చర్యలు చేపట్టాయి.

  • 15 Sep 2025 10:14 AM (IST)

    మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్

    మంచిర్యాలలో నేటి నుండి ‘‘వందే భారత్’’ హాల్టింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.

  • 15 Sep 2025 09:53 AM (IST)

    నాన్ స్టాప్ వర్షాలు

    తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు నాన్‌స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

  • 15 Sep 2025 09:30 AM (IST)

    తెలంగాణ పాలిటిక్స్‌లో RRR హీట్‌

    రీజినల్‌ రింగ్‌రోడ్డు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పెంచుతోంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఇవాళ లాస్ట్‌ డేట్‌ కావడం ఉత్కంఠ రేపుతోంది.

  • 15 Sep 2025 09:29 AM (IST)

    భారీగా పడిపోయిన ఉల్లి ధర

    నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు..

  • 15 Sep 2025 09:25 AM (IST)

    తగ్గిన బంగారం ధర

    పసిడి ప్రియులకు ఊరట లభించింది. హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,160ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.1,01,890 గా ఉంది. వెండి కిలో ధర రూ.1,42,900 గా ఉంది.

  • 15 Sep 2025 09:23 AM (IST)

    ఆంధ్రప్రదేశ్‌కి ఎల్లో అలర్ట్

    ఆంధ్రప్రదేశ్‌కి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్‌ కంటిన్యూ అవుతోంది. నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

  • 15 Sep 2025 09:15 AM (IST)

    మేడారం, ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క పర్యటన

    మేడారం మహాజాతరపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. మేడారంలోని ఏర్పాట్లను పరిశీలించేందుకు దట్టమైన అడవుల్లో మంత్రి సీతక్క బైక్‌పై వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

  • 15 Sep 2025 08:59 AM (IST)

    ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు

    ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని.. బంద్‌ను విరమించాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను కోరినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Published On - Sep 15,2025 8:59 AM

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు