ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు, కాలేజీల్లో 2023-24 విద్యసంవత్సరానికి ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. కొరిటెపాడు ఏపీఆర్‌ఈఐఎస్ కార్యాలయంలో ఏప్రిల్ 12న ఆయన ప్రవేశ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించారు.
5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, తరగతుల్లో మిగిలిన సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఏపీఆర్‌ఎస్ సెట్ – 2023 ప్రవేశ పరీక్షను మే 20న నిర్వహిస్తామన్నారు. గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 20న ఏపీ ఆర్‌జేసీ, డీసీ సెట్- 2023 పరీక్షలుంటాయన్నారు. మైనారిటీ విద్యార్థులకు మాత్రం ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండానే మే 15న ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ లో ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 4 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.