Andhra Pradesh: ఆర్టీసీ డిపోకు ఇంధనం సరఫరా చేస్తున్న ట్యాంకర్ సీజ్.. కట్ చేస్తే వెలుగులోకి షాకింగ్ విషయాలు..
అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీసీ డిపోలో కీలక పరిణామం జరిగింది. డిపోకు ఇంధన సరఫరా చేసే టాంకర్ సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. అనుమతి లేని ప్రాంతం నుండి ఇంధనం తీసుకొచ్చి..
అనంతపురం జిల్లా గుంతకల్ ఆర్టీసీ డిపోలో కీలక పరిణామం జరిగింది. డిపోకు ఇంధన సరఫరా చేసే టాంకర్ సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. అనుమతి లేని ప్రాంతం నుండి ఇంధనం తీసుకొచ్చి డిపో లో అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు అధికారులు. కాంట్రాక్టర్ కు ఆర్టీసీ బస్సులకు అనుమతించిన ప్రదేశం నుండి కాకుండా మరో ప్రాంతం నుండి డీజీల్ డిపోకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అయితే టెండర్ పొందిన వ్యక్తి మాత్రం తమకు అనుమతులు ఉన్నాయంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు.
గుంతకల్లు ఆర్టీసీ డిపోకు గార్లదిన్నె లో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ నుండి ఇంధనం సరఫరా చేయాల్సి ఉండగా సుదూర ప్రాంతంలోని మడకశిర నుండి డీజిల్ సరఫరా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం 130 కిలోమీటర్ల దూరం నుండి సరఫరా చేయాల్సి ఉండగా 450 కిలోమీటర్ల దూరం నుండి డీజిల్ తీసుకొని డిపోలో అన్లోడ్ చేయడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..