AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా టెర్రర్.. ఒక్క రోజులో 99 మంది మృతి.. 20 వేలకు పైగా కేసులు, ఈ జిల్లాల్లో భారీగా..!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోసారి 20 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా టెర్రర్.. ఒక్క రోజులో 99 మంది మృతి.. 20 వేలకు పైగా కేసులు, ఈ జిల్లాల్లో భారీగా..!
Follow us
Balaraju Goud

|

Updated on: May 18, 2021 | 5:47 PM

AP Coronavirus Today Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోసారి 20 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే, గడిచిన 24 గంటల్లోనే మళ్లీ 20 వేల మందికి పైగా కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 91,253 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 21,320 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీన్ని బట్టి పాజిటివిటీ రేటు 19.75 శాతం ఉంది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేసిన ప్రతి 100 మందిలో దాదాపు 20 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,923 మంది కరోనా బారిన పడ్డారని, ఆ తర్వాత అనంతపూర్ జిల్లాలో 2,804, చిత్తూరు జిల్లాలో 2,630, విశాఖపట్నం జిల్లాలో 2368లలో అత్యధిక కేసులు నమోదైనట్లు వివరించారు. ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా 99 మంది మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూర్ జిల్లాలో పది మంది, కృష్ణా జిల్లా, విజయనగరం జిల్లాల్లో పదేసి చొప్పున, తూర్పు గోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాల్లో తొమ్మి ది మంది చొప్పున, అనంతపూర్, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మంది చొప్పున, కర్నూల్ జిల్లాలో ఆరుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, నెల్లూరు జిల్లాలో ఐదుగురు, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇద్దరు మరణించారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరణించినవారి సంఖ్య 9,580 చేరింది.

ఇక నిన్న ఒక్కరోజు 21,274 మంది కోవిడ్ బారి నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 12,54,291 చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,81,40,307 సాంపిల్స్ ని పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక, వివిధ జిల్లాల వారీ కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..

Ap Coronavirus Today Updtes

AP Coronavirus Today Updates

Read Also…  Thunderstorm : ‘ఆ రెండు జిల్లాల్లో పెద్ద ఎత్తున పిడుగులు పడే ప్రమాదం.. చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దు’