AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Floods-Fishing: రోడ్లపైనే చేపల వేట, ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం..

AP Floods-Fishing: చేపలు పట్టాలంటే ఊరి చివరున్న కాల్వల వద్దకో.. చెరువుల దగ్గరికో వెళ్తారు. లేదా మత్సకారులు పడవల సాయంతో

AP Floods-Fishing: రోడ్లపైనే చేపల వేట, ఒక్కోటి కిలోకు పైనే.. ఎగబడ్డ జనం..
Fishing
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2021 | 6:52 AM

Share

AP Floods-Fishing: చేపలు పట్టాలంటే ఊరి చివరున్న కాల్వల వద్దకో.. చెరువుల దగ్గరికో వెళ్తారు. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ అనంతపురం జిల్లాలో మాత్రం చేపల కోసం జనాలు రోడ్లపై పరుగులు తీస్తున్నారు. కరువు సీమలో జల పుష్పల సందడి చూసిన నెటిజన్లు సైతం అవాక్కై చూస్తున్నారు.

అనంతపురం జిల్లాను భారీ వరదలు ముంచెత్తాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వరదలు వచ్చాయి. కేవలం నాలుగు రోజులు కురిసిన వర్షం.. జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాలో ఉన్న పిల్ల కాలువ దగ్గర నుంచి వాగులు, వంకలు.. పొంగిపొర్లాయి. భూగర్భజలాలు పెరిగాయి. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే జిల్లాలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కరువు ప్రాంతమైన అనంతపురం జిల్లాలో చేపల జాతర సాగుతోంది.

తంలో చుక్క నీటి కోసం అల్లాడిపోయిన ప్రాంతాల్లో భారీ నీటి ప్రవాహాలు కనిపిస్తున్నాయి. నీటి ప్రవాహాల్లో పెద్ద ఎత్తున చేపలు కనిపిస్తుండటంతో జనం చేపలు పట్టేందుకు ఎగబడ్డారు. క్వింటాళ్ల కొద్దీ చేపలను రోడ్లపైనే ఈజీగా పట్టుకుపోతున్నారు. రోడ్లపైనే చేపలు దొరకుతున్న విషయం తెలిసి.. జనం వాటి కోసం ఎగబడ్డారు. దొరికినవారు ఎంచక్కా వాటిని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకెళ్లారు. శింగనమల చెరువు వద్ద.. వందల సంఖ్యలో జనం వచ్చి చేపలు పడుతున్నారు.

Also Read:

Rashmi Gautam: ఒంపు సొంపులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ బ్యూటీ..

Aaradhya : ఐశ్వర్య ఆరాధ్య చేతిని వదిలేయి.. మరోసారి ట్రోలర్ల బారిన పడ్డ తల్లీకూతుళ్లు..

Shamna Kasim: కనువిందు చేసే అందంతో ఫాన్స్‌ని కట్టిపడేస్తున్న `ఢీ` పూర్ణ..