Vangaveeti Radha Issue: వంగవీటి రాధా హత్యకు కుట్ర జరిగిందా? రెక్కీ ఎవరు నిర్వహించారు? రాధాను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? తాజాగా రాధా చేసిన సంచలన ఆరోపణలతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. బెజవాడ రాజకీయాల్లో రాధా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వింటర్‌లో హీట్ పెంచేశాయి. వంగవీటి రంగా వర్థంతి రోజు రాధా చేసిన కామెంట్స్ బెజవాడ రాజకీయాల్లో దుమారాన్ని రేపుతున్నాయి. అసలు రాధాను హత్య చేయాల్సిన అవసం ఎవరికి ఉంది? ఎవరిని ఉద్దేశించి రాధా ఈ కామెంట్స్ చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నూరు గ్రామంలో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రాధా చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనను హత్యచేయడానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన ఆరోపణలు చేశారు రాధా. ఎవరెన్ని కుట్రలు చేసినా దేనికీ భయపడనని..ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. వంగవీటి రంగా ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. అంతేకాదు తనపై రెక్కీ నిర్వహించిన వారి పేర్లు త్వరలోనే బయటకు వస్తాయని చెప్పారు. రాధా కామెంట్లతో బెజవాడలో రాజకీయం మరోసారి రాజుకుంది. ఇప్పుడు రాధా ఎవరి పేర్లు బయటపెడతారు ? రాధాను హత్య చేసేందుకు ఎవరు రెక్కీ నిర్వహించారనే చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉందా ? అనే చర్చ కూడా జరుగుతోంది.
వంగవీటి రంగా వర్థంతి రోజే ఈ కామెంట్లు చేయడం వెనుక పొలిటికల్ ఎత్తుగడ ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాధా టీడీపీలో ఉన్నారు. పెద్దగా యాక్టివ్‌గా లేకున్నా యూత్‌లో ఆయనకో క్రేజ్ ఉంది. అయితే 2024లో విజయవాడ ఈస్ట్ నుంచి రాధా పోటీ చేస్తారనే ప్రచారమూ సాగుతోంది. దీంతో ఈ టైమ్‌లో తన హత్యకు రెక్కీ నిర్వహించారంటూ రాధా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాజకీయ వ్యూహంలో భాగంగానే రంగా వర్థంతి రోజు రాధా సంచనల కామెంట్లు చేశారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు ఇదే వేదికపై వంగవీటి రాధాపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర కామెంట్ చేశారు. రాధా బంగారం లాంటి వ్యక్తి అని అన్నారు. రాధా కల్మషం లేని మనిషి అని, తాను నమ్మిన దారిలోనే నడుస్తున్నారని వ్యాఖ్యానించారు నాని.
బెజవాడలో వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం కొనసాగుతోంది. అయితే దేవినేని నెహ్రూ అనారోగ్యంతో చనిపోయాక ఆయన వారసుడిగా దేవినేని అవినాష్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం విజయవాడ ఈస్ట్ వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు అవినాష్. అటు రాధా కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాధా తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇప్పుడు రాధాకు మద్దతుగా ఎవరు నిలుస్తారు? పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం ఎవరు? బెజవాడలో ఆధిపత్య రాజకీయాలు మళ్లీ ఎటు వైపు దారి తీస్తాయోననే పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
Also read:
Vangaveeti Radha: వంగవీటి రాధాకు 2+2 సెక్యూరిటీ.. ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం ఆదేశం..
Viral Video: ఎలుగుబంటి తెలివితేటలకు నెటిజన్లు ఫిదా.. రోడ్ సేఫ్టీపై వైరల్ వీడియో..