Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కోడి కత్తుల అలజడి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వేలాది కత్తులు..

|

Nov 26, 2022 | 1:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో పందెం కత్తులు అలజడి రేపాయ్‌. వందో, రెండొందలో కాదు.. ఏకంగా వేలల్లో కత్తులు పట్టుబడ్డాయ్‌. అవును, సంక్రాంతికి ముందే కోడి కత్తులు కలకలం రేపుతున్నాయ్‌. కత్తులను కోడి కాళ్లకు కట్టకుండానే ..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కోడి కత్తుల అలజడి.. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వేలాది కత్తులు..
Cock Fight Knifes
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పందెం కత్తులు అలజడి రేపాయ్‌. వందో, రెండొందలో కాదు.. ఏకంగా వేలల్లో కత్తులు పట్టుబడ్డాయ్‌. అవును, సంక్రాంతికి ముందే కోడి కత్తులు కలకలం రేపుతున్నాయ్‌. కత్తులను కోడి కాళ్లకు కట్టకుండానే యుద్ధానికి సై అంటున్నాయ్‌. రారమ్మంటూ పందెంరాయుళ్లను ఊరిస్తున్నాయ్‌. అవును, ఎన్టీఆర్‌ జిల్లాలో అప్పుడే కోడి కత్తులు సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నాయ్‌. సంక్రాంతి పండగ కోసం పెద్దఎత్తున రెడీ అవుతున్నాయ్‌ కోడి కోత్తులు. పదులు వందల్లో కాదు, వేలల్లో సిద్ధమవుతున్నాయ్‌. చిన్న కుటీర పరిశ్రమగా ఈ కోడి కత్తులను తయారు చేస్తున్నారు కొందరు. విస్సన్నపేటలో కోడి కత్తుల తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు పోలీసులు.

2,300కోడి కత్తులను, ఐదు తయారీ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సంక్రాంతి టైమ్‌లో కోడి పందేల నియంత్రణకు ఇప్పట్నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ఏసీపీ రమేష్‌. ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంక్రాంతి అంటేనే కోడిపందేలు. పండుగ తేదీ సమీపిస్తుండటంతో పందెం రాయుళ్లు రెడీ అయిపోతున్నారు. పందెం కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి నుంచే వాటికి ట్రైనింగ్ ఇస్తున్నారు. కోడి పందేల ఏర్పాటుకు కసరత్తులు గట్టిగానే చేస్తున్నారు. ఇక ఈ కోడిపందేల నిర్వహణను అడ్డుకునేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా, అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కారణం, సామాన్యులు మొదలు, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ ఈ కోడి పందేలను నిర్వహించడమే. పలు చోట్ల పెద్దల అండతోనే ఈ కోడి పందేలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈసారి కోడిపందేలు ఎలా జరుగుతాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..