Child Marriage: ఆధార్‌ కార్డులో వివరాలు మార్చి బాల్య వివాహానికి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?

అబ్బాయికి 17, అమ్మాయికి 13 ఏళ్లు. అయినా పెళ్లి చేయాలని నిశ్చయించారు ఇరు కుటుంబాల పెద్దలు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి. కానీ సడెన్ గా.. పిలవని పేరంటానికి అతిథులు వచ్చినట్లు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పెళ్లి మండపం వద్దకు వెళ్లారు

Child Marriage: ఆధార్‌ కార్డులో వివరాలు మార్చి బాల్య వివాహానికి యత్నం.. చివరికి ఏం జరిగిందంటే?
Marriage

Edited By:

Updated on: Nov 08, 2023 | 6:53 PM

అబ్బాయికి 17, అమ్మాయికి 13 ఏళ్లు. అయినా పెళ్లి చేయాలని నిశ్చయించారు ఇరు కుటుంబాల పెద్దలు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఆ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాలి. కానీ సడెన్ గా.. పిలవని పేరంటానికి అతిథులు వచ్చినట్లు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బాల్య వివాహం చేస్తున్నారని పోలీసులకు సమాచారం రావడంతో పెళ్లి మండపం వద్దకు వెళ్లారు. అయితే అమ్మాయి తల్లిదండ్రులు బురిడీ కొట్టించాలనుకున్నారు. 19 ఏళ్ళు నిండిన అమ్మాయి మేజర్ అయినందున పెళ్లి చేస్తున్నామని మొదటి చెప్పారు. పోలీసులకు ఆధార్ కార్డు ప్రూఫ్ కూడా చూపించారు. ఇక్కడే అసలు విషయం ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితమే ఆధార్ కార్డు అప్డేట్ చేస్తున్న సందర్భంలో అమ్మాయి వయసు 13 ఏళ్లు ఉంటే.. 19 సంవత్సరాలుగా మార్చారు తల్లిదండ్రులు. అనంతపురం రూరల్ బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో బాల్యవివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి చేసుకున్న రెండు కుటుంబాల వారికి పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేశారు. ఎవరైనా పెళ్లికి అడ్డు చెప్పకుండా ఉండేందుకు పకడ్బందీగానే మైనర్ బాలిక తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆధార్ కార్డులో వయసు మార్చడం, ఎవరైనా అడిగితే తనకు 19 ఏళ్ళని అమ్మాయితో చెప్పించడం లాంటివి ముందే ప్లాన్ చేసుకున్నారు. అయినా పోలీసుల ఎంట్రీతో మొత్తానికి బాల్య వివాహం క్యాన్సిల్ అయింది. ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడంతో మైనర్ల పెళ్లి ఆగిపోయింది.  కాగా తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో అనంతపురం జిల్లా ఒకటి. అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇక్కడి జనాల్లో మార్పు రావడం లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..