Andhra Pradesh: బాపట్లలో ఉద్రిక్తత.. పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు! అసలేం జరిగిందంటే..

|

Jan 21, 2024 | 9:55 PM

గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని హత మార్చి, మృతదేహాన్ని మాయం చేశారు. దీనిపై కేసు నమోదు చేయగా పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నిసనకారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం తలెత్తింది..

Andhra Pradesh: బాపట్లలో ఉద్రిక్తత.. పలువురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
Bapatla Protest
Follow us on

బాపట్ల, జనవరి 21: గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధుడిని హత మార్చి, మృతదేహాన్ని మాయం చేశారు. దీనిపై కేసు నమోదు చేయగా పోలీసులు పట్టీపట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి నిసనకారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి, పలువురిని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటన బాపట్ల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బాపట్లలోని అమర్తలూరు మండలం ఇంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొలిమేరి తిరుపతయ్య (65) అనే వృద్దున్ని నాలుగు నెలలు క్రితం హత్యకు గురయ్యాడు. దీంతో అతని శవాన్ని మాయం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలంటూ స్థానికులు, బంధువులు ఆందోళనకు దిగారు. హత్యకు పాల్పడిన వ్యక్తులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని వెలికి తీయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇంటూరు లాకులు వద్ద రహదారిపై నిరసన కారులు షామియానా వేసి, ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిరసన కారులతో పోలీసులు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి, షామియానా పీకేశారు. నిరసన శిబిరాన్ని తొలగించి పోలీసులు.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.