Temples Issue: ఆలయాలపై వరుస దాడులు.. అప్రమత్తమైన పోలీస్ యంత్రంగాం.. ఆలయా భద్రతకై సురక్ష ఆపరేషన్..
Temples Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
Temples Issue: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో దేవాలయాలు ఎక్కువగా ఉండటంతో ఆ జిల్లా పోలీస్ అధికారులు అలెర్ట్ అయ్యారు. జిల్లాలో నాలుగు వేలకు పైగానే టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు దేవాదాయ శాఖ ఆలయాలు, ప్రైవేటు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల భద్రత కోసం 4వేల సీసీ కెమెరాలను జిల్లా పోలీసులు సిద్ధం చేశారు. సంబంధిత ఆలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
అదే సమయంలో ఆలయాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేశారు. గ్రామాల్లో డిఫెన్స్ కమిటీలను ఏర్పాటు చేసి ఆలయాల భద్రతపై సురక్ష ఆపరేషన్ చేపట్టారు. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే అసాంఘీక శక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్ట్రాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని తేల్చి చెప్పారు.
Also read:
అమెరికా క్యాపిటల్ భవనంలో బాష్పవాయు ప్రయోగం, కాల్పుల్లో మహిళ సహా నలుగురి మృతి, అంతా భీభత్సం