AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP ‘Chalo Ramatheertham’ Live Updates : నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద హైటెన్షన్..

రామతీర్థం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై విమర్శల దాడి జరుగుతుంది. కాడా బీజేపీ-జనసేన సంయుక్తంగా...

BJP 'Chalo Ramatheertham' Live Updates :  నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద హైటెన్షన్..
Ram Naramaneni
|

Updated on: Jan 07, 2021 | 2:12 PM

Share

రామతీర్థం ఘటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై విమర్శల దాడి జరుగుతుంది. కాడా బీజేపీ-జనసేన సంయుక్తంగా చేపట్టిన ధర్మయాత్రను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం మరోసారి ‘చలో రామతీర్థం’ కు పిలుపునిచ్చింది బీజేపీ. ఎట్టి పరిస్థితిల్లోనూ రామతీర్థం ఆలయాన్ని నేడు సందర్శించే తీరుతామని తేల్చిచెప్పారు బీజేపీ నేతలు. ఈ క్రమంలో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ర్యాలీలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో మరోసారి హై టెన్షన్ నెలకుంది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Jan 2021 01:39 PM (IST)

    కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నాం : డీజీపీ గౌతమ్ సవాంగ్

    రామతీర్థం ఘటనపై కుట్రకోణాన్ని పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. బోడికొండపై రామాలయానికి విద్యుత్ సదుపాయం కల్పించి రెండు మూడు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో దాడి జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఆలయం, చుట్టుప్రక్కల ప్రాంతాలు బాగా తెలిసినవారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చు అన్న డీజీపీ.. దర్యాప్తు పురోగతిలో ఉందని వెల్లడించారు. వరుస ఘటనల నేపథ్యంలో ఒక దానికి మరో దానితో సంబంధం ఏమైనా ఉందా? అని విశ్లేషిస్తున్నట్లు వివరించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని లక్ష్యంగా చేసుకునే దాడులు జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు.

  • 07 Jan 2021 01:06 PM (IST)

    వెల్లంపల్లిని మ౦త్రివర్గ౦ నుండి తొలగించాలి : విష్ణుకుమార్ రాజు

    రామతీర్థం శా౦తియుత౦గా వెళ్తామంటున్నా పోలీసులు అడ్డుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. తమ పార్టీ నేతలు ఇప్పటికే విజయనగరం జిల్లాకి చేరుకున్నారని..వారిని నిలువరించడం భావ్యం కాదన్నారు.  దేవాలయలపై వరుస దాడులు జరుగుతున్నా ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. మ౦త్రి వెల్ల౦పల్లిని మ౦త్రివర్గ౦ నుండి తొలగించాలని సూచించారు.

  • 07 Jan 2021 12:50 PM (IST)

    విష్ణువర్ధన్ రెడ్డిని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించన పోలీసులు

    విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. రామతీర్థం వెళ్లకుండా అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆయన   స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  ఎమ్మెల్సీ మాధవ్ ను నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ తరలించారు.  బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు,  సోము వీర్రాజును పోలీసులు వాహనంలో తిప్పుతున్నారు.

  • 07 Jan 2021 12:40 PM (IST)

    రామతీర్థంకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్‌ దేవ్‌ధర్

    రామతీర్థంలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ ఎట్టి పరిస్థితిల్లోనూ కార్యకర్తలతో కలిసి దేవాలయాన్ని సందర్శిస్తామని ఆందోళన చేస్తోంది. పోలీసులు అంతమందికి అనుమతి నిరాకరిస్తున్నారు. పరిమిత సంఖ్యలో పరిశీలించి రావాలని కోరుతున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి సునీల్‌ దేవ్‌ధర్‌ సహా పలువురు బీజేపీ కీలక నేతలు రామతీర్థం యాత్రకు బయలుదేరారు. వీరిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.

  • 07 Jan 2021 12:20 PM (IST)

    రాష్ట్రంలో బీజేపీని అణగద్రొక్కే ప్రయత్నం : జీవీఎల్

    ఏపీ ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీని అణగద్రొక్కడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోము వీర్రాజు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిస్థితులన్నీ అమిత్ షా‌కు వివరిస్తున్నట్లు చెప్పారు.

  • 07 Jan 2021 12:02 PM (IST)

    ప్రభుత్వానికి విష్ణువర్ధన్ రెడ్డి వార్నింగ్

    ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో రామతీర్థం ఆలయంలోకి అనుమతించేవరకు ప్రభుత్వాన్ని, పోలీసులను వదిలిపెట్టబోమని  బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. రామతీర్థం కొండపైకి ర్యాలీగా వెళ్లేందుకు గురువారం ఉదయం బీజేపీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం ఐదుగురిని మాత్రమే అనుమతి ఉందన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.  సోమువీర్రాజు సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సోము వీర్రాజుకు ఏమైనా అయితే జగన్ ప్రభుత్వం 24 గంటలు కూడా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని, భయపడమన్నారు.

  • 07 Jan 2021 11:30 AM (IST)

    ఐదుగుర్ని మాత్రమే అనుమతిస్తాం : పోలీసులు

    బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితిల్లో రామతీర్థం ఆలయాన్ని సందర్శించే తీరుతామని ఆందోళన చేస్తున్నారు. రామతీర్థం జంక్షన్ దగ్గర కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసుల్ని భారీగా మోహరించారు. ర్యాలీలు, ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు మరోసారి వివరణ ఇచ్చారు. రామతీర్థంకు ఐదుగుర్ని మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

  • 07 Jan 2021 11:03 AM (IST)

    నెలిమర్ల జంక్షన్‌లో టెన్షన్

    బీజేపీ ఛలో రామతీర్థంలో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. బీజేపీ శ్రేణులను నెలిమర్ల వద్ద అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులను సోము వీర్రాజు నెట్టివేశారు. ఆపై రోడ్డపై పడుకుని నిరసన తెలిపారు.

  • 07 Jan 2021 10:58 AM (IST)

    సొమ్మసిల్లి పడిపోయిన సోము వీర్రాజు, విష్ణువర్ధన్​రెడ్డి

    విజయనగరం జిల్లా రామతీర్థానికి బయల్దేరిన బీజేపీ నేతలను… నెల్లిమర్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తమను ఆలయానికి అనుమతించాల్సిందే అని నేతలు పట్టుబట్టగా.. పోలీసులు అంగీకరించలేదు. అక్కడ.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్​రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

  • 07 Jan 2021 10:52 AM (IST)

    ఇతర నిందితులను కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు..

    బోయిన్‌ పల్లిలో కిడ్నాప్‌ కేసులో ఇప్పటికే ఏవీ సుబ్బారెడ్డిని విచారించగా, అఖిల ప్రియను రిమైండ్‌కు పంపించన విషయం తెలిసిందే. ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులమంటూ ప్రవీణ్‌ రావు ఇంటికి వచ్చిన నిందుతులను కాసేపట్లో కోర్టులో హాజరుపరచడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో చూడాలి.

  • 07 Jan 2021 10:24 AM (IST)

    ఇవాళ్టి ఆందోళనలో బీజేపీ జాతీయ నేత సునీల్ దేవధర్‌ పాల్గొనే అవకాశం !

    విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం వద్ద ఉత్కంఠ కొనసాగుతోంది. రెండోసారి బీజేపీ చలో రామతీర్థానికి పిలుపునివ్వడంతో నెల్లిమర్ల కూడలి వద్ద నేతలను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రెండ్రోజుల క్రితం నెల్లిమర్లలో సోము వీర్రాజు అరెస్టుతో బీజేపీ ఆందోళనబాట పట్టింది. నేటి ఆందోళనలో పార్టీ జాతీయ నేత సునీల్ దేవధర్‌ సైతం పాల్గొనే అవకాశం ఉంది.

  • 07 Jan 2021 10:04 AM (IST)

    ఈ నెల 20 తర్వాత సోము వీర్రాజు రాష్ట్ర పర్యటన

    బీజేపీ నేతల పర్యటన నేపథ్యంలో… రామతీర్థంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏపీలో ధ్వంసం చేసిన ఆలయాలను, దేవతా విగ్రహాలను పరిశీలించేందుకు ఈనెల 20 తర్వాత రాష్ట్ర పర్యటన చేపట్టనున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.

  • 07 Jan 2021 09:49 AM (IST)

    రామతీర్థం నూతన ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు

    కోదండరాముని ఆలయం, నీటి మడుగును పరిశీలించిన అనంతరం రామతీర్థం దేవస్థానం అధికారులతో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు. అనంతరం ఆ శాఖ ఎస్​ఈ శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ.. కోదండరాముని విగ్రహం ధ్వంసం కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ సామగ్రి ఎంత అవసరమో.. అన్నదాంతోపాటు ఇతర అంచనాలు వేశామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.

  • 07 Jan 2021 09:44 AM (IST)

    బీజేపీ నేత గద్దె బాబూరావు అరెస్ట్..

    రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. తప్పించుకుని విజయనగరం చేరుకున్న నాయకులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా నెల్లిమర్ల ఆర్చ్ వద్ద బీజేపీ నేత గద్దె బాబూరావును అరెస్ట్ చేశారు. మరోసారి  నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్ వద్ద ఉద్రిక్తత నెలకుంది. రామతీర్థం వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం కొనసాగుతోంది.

Published On - Jan 07,2021 1:39 PM