Cockfights in Godavari Districts: నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్.. పందాల కట్టడికి గ్రామ కమిటీలు
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి పోలీసులు అధికారులు అలెర్టయ్యారు. కోవిడ్ వ్యాప్తి కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితిల్లోనూ కోడి పందాలను జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Cockfights in Godavari Districts: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి పోలీసులు అధికారులు అలెర్టయ్యారు. కోవిడ్ వ్యాప్తి కూడా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితిల్లోనూ కోడి పందాలను జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవ్వనుంది. కోడి పందాల కట్టడికి గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. పందాల బరులు కోసం స్థలాలు ఇచ్చేవారికి పోలీసులు నోటిసులు జారీ చేశారు. కోడికత్తుల తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
కాగా ప్రతి సంవత్సరం పోలీసులు హెచ్చరికలు జారీ చెయ్యడం..బరుల నిర్వాహకులు వాటిని లైట్ తీసుకోవడం ఎన్నో సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈసారి మాత్రం ముందస్తుగా పందాలను అడ్డుకోవడానికి పక్కా ప్రణాళికలు రూపొందించారు. మరి కాప్స్ ప్రయత్నాలు ఈసారి ఎంతమేర ఫలిస్తాయో చూడాలి. ఇక సంక్రాంతి సమయంలో గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాాల్లో వీక్షించడానికి..పందాలు వేయడానికి తెలంగాణతో పాటు చుట్టుప్రక్కల రాష్ట్రాల నుంచి కూడా పందెం రాయుళ్లు వస్తారు.
Also Read :
Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్