Polavaram Project damaged: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో అనుకోని అవాంతరం ఎదురైంది. సుమారు రెండు కిలోమీటర్ల పొడవు ఉండే డయాఫ్రమ్ వాల్ డ్యామేజైంది. దాంతో, ప్రాజెక్టు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్‌ను CWC నిపుణుల బృందం పరిశీలించింది. డయాఫ్రమ్ వాల్ డామేజైందన్న ఇన్ఫర్మేషన్‌తో కేంద్ర జలశక్తిశాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ నేతృత్వంలోని ఎక్స్‌పర్ట్ కమిటీ ఎగ్జామిన్ చేసింది. డయాఫ్రమ్ వాల్‌ను తిరిగి కట్టాలా? లేక మరమ్మతులు చేస్తే సరిపోతుందా? అనేది పరిశీలించారు. 1.7 కిలోమీటర్ల పొడవున్న డయాఫ్రమ్ వాల్ అనేకచోట్ల దెబ్బతిందన్నారు CWC సలహాదారు శ్రీరామ్. CWC కమిటీ పరిశీలన తర్వాత అధికారులతో హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఇరిగేషన్ మినిస్టర్ అంబటి రాంబాబు. రెండు కాఫర్ డ్యామ్‌లు నిర్మించకుండా ముందుగా డయాఫ్రమ్ వాల్ నిర్మించడం పెద్ద చారిత్రక తప్పిదమన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఈ మిస్టేక్‌తోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌కు మరమ్మతులు చేస్తే సరిపోతుందా? లేక సమాంతరంగా పునర్ నిర్మాణం చేపట్టాలా? అనేది పరిశీలిస్తున్నట్లు తెలిపారు CWC సలహాదారు శ్రీరామ్. సవరించిన పోలవరం అంచనాలను కేంద్రం పరిశీలిస్తోందని, అయితే సోషియో ఎకనమిక్ సర్వే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. డయాఫ్రమ్ వాల్‌పై ఏ నిర్ణయమైనా పూర్తి అధ్యయనం తర్వాత ఉంటుందన్నారు CWC సలహాదారు శ్రీరామ్. అయితే, కేవలం మరమ్మతులకే 2వేల 500కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్న నిపుణుల మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..