Andhra Pradesh: వామ్మో.. ఇదేదో పుష్పగాడి రూల్‌లా ఉందే! స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌

|

May 26, 2024 | 11:18 AM

స్మార్ట్‌ ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ప్రతిదీ వాట్సప్‌లో షేర్‌ చేస్తున్నారు. రకరకాల గ్రూపులు క్రియేట్‌ చేసి ముఖ్యమైన సమాచారం కేవలం ఒక్క మెజేస్‌తో అందరికీ తెలియజేసుకుంటున్నారు. తాజాగా ఓ స్కూల్‌ తమ ఉపాధ్యాయులందరికీ వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసింది. గ్రూప్‌లో అందరూ యాక్టివ్‌గా ఉండాలని హుకుం జారీ చేసింది. అయితే వాట్సప్‌ చూడట్లేదని ఓ గవర్నమెంట్‌ టీచర్‌పై డీఈవో ఏకంగా సస్పెన్షన్‌ వేటు..

Andhra Pradesh: వామ్మో.. ఇదేదో పుష్పగాడి రూల్‌లా ఉందే! స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌
Teacher Suspended Over WhatsApp Inactivity
Follow us on

విజయవాడ, మే 26: స్మార్ట్‌ ఫోన్లు చేతిలోకి వచ్చాక.. ప్రతిదీ వాట్సప్‌లో షేర్‌ చేస్తున్నారు. రకరకాల గ్రూపులు క్రియేట్‌ చేసి ముఖ్యమైన సమాచారం కేవలం ఒక్క మెజేస్‌తో అందరికీ తెలియజేసుకుంటున్నారు. తాజాగా ఓ స్కూల్‌ తమ ఉపాధ్యాయులందరికీ వాట్సాప్‌ గ్రూప్‌ ఒకటి క్రియేట్‌ చేసింది. గ్రూప్‌లో అందరూ యాక్టివ్‌గా ఉండాలని హుకుం జారీ చేసింది. అయితే వాట్సప్‌ చూడట్లేదని ఓ గవర్నమెంట్‌ టీచర్‌పై డీఈవో ఏకంగా సస్పెన్షన్‌ వేటు వేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని మొగల్రాజపురం బీఎస్‌ఆర్కే ఉన్నత పాఠశాలలో ఎ రమేశ్‌ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొంతకాలంగా ఆయన స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లను పట్టించుకోకపోగా.. వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి అకస్మాత్తుగా వైదొలగాడు. దీని గురించి పై అధికారులు వివరణ కోరగా సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. దీంతో రమేశ్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలుసకున్న ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

నిజానికి, రమేష్‌కు కంటి సంబంధిత సమస్య ఉందని, స్మార్ట్‌ఫోన్‌ వాడొద్దని వైద్యులు సూచించారని రమేశ్‌ వివరణ ఇచ్చినప్పటికీ అధికారులు వినిపించుకోలేదు. దీంతో పర్సనల్‌ విషయాన్ని సాకుగా చూపించి సస్పెండ్‌ చేయడమేంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. దీనిపై యూటీఎఫ్‌ అధ్యర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకులు రాజేశ్వరికి శనివారం వినతిపత్రం అందజేశారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు మాట్లాడుతూ.. వాట్సప్‌ గ్రూపు నుంచి రమేష్‌ అకస్మాత్తుగా వెళ్లిపోవడం, విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడం, కంటి సమస్య ఉన్నట్లు వైద్యులు సూచించిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని కోరినా స్పందించకపోవడం వల్లే ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు వివరణ ఇచ్చారు. ఇక ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర దుమారం లేపుతోంది. కేవలం వాట్సప్‌ గ్రూప్‌ చూడటంలేదనే సాకుతో ఒక ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి తప్పించడం ఏంటని సర్వత్రా విమర్శిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.