Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల ఏర్పాటు సర్వం సిద్ధమైంది. మరోవైపు కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు పై వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల ఏర్పాటుపై పలు డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే జిల్లాల పునర్విభజనను కొందరూ వ్యతిరేకిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకటన వచ్చిందే తడవు అనంతపురం జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని.. ఇలాంటి సమయంలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందని వైసిపీ నేతలతో పాటు.. ఇతర స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓవైపు సత్యసాయి జిల్లా ఏర్పాటుపై జిల్లా అంతటా సంబురాలు జరుగుతుండగా మరోవైపు హిందూపురంలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ అఖిల పక్షం చేపట్టిన బంద్ నేడు కూడా కొనసాగుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారు. తాము హిందూపురం కోసం ఎంత దూరమైన వెళ్తామమని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికే జిల్లాల ఏర్పాటు పై తన అభిప్రాయాన్ని వినిపించారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్వ్యస్థీకరణ నిర్ణయాన్ని హిందూపురం ఎమ్మెల్యే(Hindupuram MLA) నందమూరి బాలకృష్ణ స్వాగతించారు. వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన హిందూపురాన్ని సత్యసాయి జిల్లాలో జిల్లా కేంద్రం చేయాలని బాలయ్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఆరోగ్యం, కుటుంబ సమస్యలను తొలగించే రథ సప్తమి.. పూజ, ముహుర్త సమయం తెలుసుకోండి