Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP ZPTC MPTC Results: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్.. అదే రోజు ఫలితాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో.. ‘పరిషత్‌’ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియకు, ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ డేట్ ఫిక్స్ చేసింది.

AP ZPTC MPTC Results: ఈనెల 19న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల కౌంటింగ్.. అదే రోజు ఫలితాలు
Ap Sec
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 17, 2021 | 8:00 AM

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపునకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈనెల 19న ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ లెక్కింపునకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ పేర్కొంది.  కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్​తో.. ఎస్​ఈసీ నీలం సాహ్ని నేడు సమావేశం కానున్నారు.

జెడ్పీడీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ 1న ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. ఏప్రిల్ 8న ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ హడావుడిగా నిర్వహించారని.. సుప్రీం కోర్టు మార్గనిర్దేశకాలను పాటించలేదంటూ  కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్లను విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికలను రద్దు చేస్తూ.. మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ….ఎస్​ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న ధర్మాసనం విచారణ జరిపింది. తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కింపునకు అనుమతిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో 515 జడ్పీటీసీ, 7,321 ఎంపీటీసీ సీట్లకు కౌంటింగ్‌ జరుగుతుంది.

మొత్తం 9,692 ఎంపీటీసీ సీట్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. పలు కారణాల వల్ల 354 ఎంపీటీసీ సీట్లలో పోలింగ్ ఆగింది. మిగిలిన 7,321 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలు రాష్ట్రంలో ఉంటే 652 జడ్పీటీసీ సీట్లకు నోటిఫికేషన్‌ రిలీజ్ అయ్యింది. 126 జడ్పీటీసీ సీట్లలో ఎన్నిక ఏకగ్రీవం అయింది. 515 జడ్పీటీసీ సీట్లలో ఎన్నిక జరిగింది.

Also Read: సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్‌.. దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు

 9 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించిన ఆయా.. 20 ఏళ్ల జైలు శిక్ష