AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మంత్రికి తప్పిన ప్రమాదం.. వేదికపై మాట్లాడుతుండగానే.. ఊహించని పరిణామం

మనం అప్పుడప్పుడు సెలిబ్రెటీలు, నాయకులు వేదికలపై ఉన్నప్పుడు స్టేజీలు కుప్పకూలిన దృశ్యాలను మనం చూస్తూ ఉంటాం.. అవీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

AP News: మంత్రికి తప్పిన ప్రమాదం.. వేదికపై మాట్లాడుతుండగానే.. ఊహించని పరిణామం
Vasamsetti Subhash Escaped From An Accident
Pvv Satyanarayana
| Edited By: Velpula Bharath Rao|

Updated on: Oct 30, 2024 | 7:25 AM

Share

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నంలో శెట్టిబలి కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యప్రభ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. శెట్టిబలిజ జాతిపిత, బర్మా కేసరి, బర్మా మేయర్ అవార్డు గ్రహీత కీర్తిశేషులు దొమ్మేటి వెంకట రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వేదిక పై మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేదిక కుప్పకూలడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది జాగ్రత్తతో తృటీలో ప్రమాదం తప్పినట్లు అయింది. వేదిక పై మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేదిక కూలిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సిబ్బంది అప్రమత్తమవ్వడంతో తృటీలో ప్రమాదం తప్పింది. అయితే స్టేజ్ పైకి అధిక సంఖ్యలో స్థానిక నేతలు రావడంతోనే బరువుకి కిందకి కుంగినట్లు తెలుస్తోంది. ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు, నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..