Amara Raja: ఏపీ నుంచి అమరరాజా కంపెనీ తరలిపోనుందా?.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం నుంచి తమిళనాడుకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ తరలిపోనుందని వెలువడుతున్న కథనాలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.

Amara Raja: ఏపీ నుంచి అమరరాజా కంపెనీ తరలిపోనుందా?.. మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Amararaja Batteries

Updated on: Aug 05, 2021 | 2:01 PM

AP Minister Peddireddy On Amara Raja Issue: అమ‌రరాజా బ్యాట‌రీస్ కంపెనీ వ్య‌వ‌హ‌రంపై తనకు పెద్ద‌గా అవ‌గాహ‌న లేదంటూ ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప‌రిశ్ర‌మలు రావ‌డంతో పాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం కూడా ప్ర‌భుత్వం చూడాల్సి ఉంటుందన్నారు. అమరరాజా బ్యాటరీ కంపెనీ ఏపి నుండి ఇంకో రాష్ట్రానికి తరలిపోవాలని తాము కోరుకోవ‌డం లేదన్నారు. అయితే లాభాల కోస‌మే ఇత‌ర రాష్ట్రాల‌కు వేళ్లాల‌ని ఆ కంపెనీ భావిస్తోందని వ్యాఖ్యానించారు. రీలోకేట్ చేయాలంటే చిత్తూరులోనే వేరే చోట 5 వేల ఎక‌రాలు కంపెనీకి ఉందని… అక్క‌డికి త‌ర‌లించ‌వ‌చ్చని వ్యాఖ్యానించారు. నిభంద‌న‌లు ప్ర‌కారం రిలోకేష‌న్ చేయాల్సి ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రం నుంచి తమిళనాడుకు అమరరాజా బ్యాటరీస్ కంపెనీ తరలిపోనుందని వెలువడుతున్న కథనాలపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో 255 మంది ఏంపిడివోలకు ప‌దోన్న‌తులు క‌ల్పించినట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స‌మ‌స్య‌ను సీఎం జ‌గ‌న్ ప‌రిష్క‌రించారని కొనియాడారు. ఇది 12 విభాగాల్లో 18500 మందికి సంబందించిన అంశమని..సియం జ‌గ‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ సమస్య పరిష్కారంతో రాష్ట్రంలో పంచాయితీ రాజ్ శాఖ ప‌నితీరు మెరుగుపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.

Also Read..

యో యో హనీ సింగ్ కేసులో ట్విస్ట్.. భారీగా పరిహారం కోరుతున్న సింగర్ భార్య.. ఎంతంటే..

 మీ పిల్లలు అతిగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆ సమస్యలు తథ్యమంటున్న వైద్య నిపుణులు