టీడీపీ-జనసేన పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. ఈ విషయం మొన్నటికి మొన్న మరోసారి రుజువయ్యిందన్నారు. ఆ రెండు పార్టీలు పదవుల కోసం పరస్పరం సహకరించుకున్నాయని అన్నారు. దీంతో ఆ పార్టీలు కలిసి ఉన్నాయని మరోసారి బయటపడిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఓ వైపు సంస్కారం గురించి మాట్లాడుతూ.. మరోవైపు తిడుతుంటారని మండిపడ్డారు. తోలు తీస్తా అంటూ పవన్ పదేపదే అంటున్నారని.. తోలు తీయించుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడే భాష ఎలా ఉందో పవనే ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు.
పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తిగా ఆమె విమర్శించారు. లెఫ్టిస్టునని చెబుతూ.. బీజేపీతో చేతులు కలపడం, ఒంకోసారి టీడీపీతో కలుస్తుంటారని అన్నారు. పవన్ కల్యాణ్ పట్ల రాష్ట్ర ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారని ఎద్దేవా చేశారు. అన్ని కులాల మద్ధతుతోనే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు.
మేకతోటి సుచరిత వీడియో..
Also Read..
Badvel By-Election: బద్వేలు బైపోల్స్‌లో జనసేనతో బీజేపీ పొత్తు.. క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు