Kodali Nani: అశోక్‌ బాబైనా, చంద్రబాబైనా చట్టం ముందు ఒకటే.. టీడీపీపై మరోసారి నిప్పులు చెరిగిన కొడాలి నాని..

|

Feb 11, 2022 | 4:45 PM

Kodali Nani: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఉద్యోగాల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు గురువారం అర్థరాత్రి ఆయనను..

Kodali Nani: అశోక్‌ బాబైనా, చంద్రబాబైనా చట్టం ముందు ఒకటే.. టీడీపీపై మరోసారి నిప్పులు చెరిగిన కొడాలి నాని..
Kodali Nani
Follow us on

Kodali Nani: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఉద్యోగాల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు గురువారం అర్థరాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. అశోక్‌ బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని విమర్శించారు. వ్యవస్థలను కక్ష్య సాధించు చర్యలకు వాడుకుంటున్నారని తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఇదిలా ఉంటే అశోక్‌ బాబుకు బెయిల్‌ ఇచ్చేది లేదని హైకోర్టు తీర్పునిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. తాడేపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన అశోక్‌ బాబు అరెస్ట్‌ వ్యవహారంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అశోక్‌ బాబు.. దొంగ సర్టిఫికేట్‌తో వేరే వారికి రావాల్సిన ప్రమోషన్‌ను దొంగలించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రజలు భావోద్వేగాలకు గురైతే దానిని అడ్డంపెట్టుకొని ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబుకు మద్ధతు తెలిపి ఎమ్మెల్సీ పదవిని పొందారు. అశోక్‌ బాబును అరెస్ట్‌ చేయడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దొంగ సర్టిఫికెట్లతో పదవి పొందడం తప్పుకాదా.?

అశోక్‌ బాబు దొంగ సర్టిఫికేట్ల వ్యవహారంపై ఎన్నికల సంఘం పరిశీలించి లోకయుక్తకు సమాచారం ఇస్తే, వారు ప్రాథమికంగా విచారించి ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దొంగ సర్టిఫికేట్లతో పదవి పొందిన వారిని అరెస్ట్‌ చేస్తే.. ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శిస్తున్నారు. చంద్రబాబు కోసం అశోక్‌ బాబు నీచమైన పనులు చేశారో, ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీని నీచపరులను కాపడానికి ఉపయోగిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. చట్టం దృష్టిలో అశోక్‌ బాబు అయినా, చంద్రబాబు అయినా ఒకటే. ఇక్కడ ఉన్నది ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి’ అని ఘూటుగా స్పందించారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం..

ఇదిలా ఉంటే రాజధాని అంశంపై కూడా నాని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై మరోసారి బిల్లుపెడతామని తేల్చిచెప్పారు. మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని, ప్రతిపక్షాలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ప్రజల ఆమోదంతో మూడు రాజధానులను తీర్చిదిద్దుతామని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ రాజధాని అంశం మరోసారి పొలిటికల్‌ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Also Read: TS Polytechnic: తెలంగాణ పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌.. ఆందోళనలో విద్యార్థులు..

IPL 2022 Auction: మెగా వేలంలో ఈ ముగ్గురిపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్.. వారెవరంటే?