AP Capital Issue: ఉత్తరాంధ్రలో ఆస్తులన్నీ పరాయివాళ్లవే.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి ధర్మాన..

|

Oct 23, 2022 | 4:28 PM

దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా.. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో..

AP Capital Issue: ఉత్తరాంధ్రలో ఆస్తులన్నీ పరాయివాళ్లవే.. సంచలన ఆరోపణలు చేసిన మంత్రి ధర్మాన..
Minister Dharmana Prasada Rao
Follow us on

దేశంలో అయినా, రాష్ట్రంలో అయినా.. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన.. సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరాంధ్రలో ఆస్తులన్నీ పరాయివాళ్ల చేతుల్లోనే ఉన్నాయని అన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమవడం దారుణం అన్నారు. ఉత్తరాంధ్ర చాలా వెనుకబడి ఉందని అన్నారు.

వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయుంటే.. ఉత్తరాంధ్ర తీవ్రంగా నష్టపోయేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం ఆలోచనతోనే.. ఇప్పుడు విశాఖకు రాజధానిగా అవకాశం వచ్చిందన్నారు. కానీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, శివరామకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా అమరావతి రైతులు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రైతులది రాజ్యాంగ విరుద్ధమైన యాత్ర అని విమర్శించారు. తమ స్వార్థం కోసం వింత వాదన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజధానిగా విశాఖను వ్యతిరేకించడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

స్పీకర్ తమ్మినేని సంచలన ఆరోపణలు..

అమరావతి రైతులది యాత్ర కాదు డ్రామా అన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఈ యాత్రను వెనకుండి నడిపిస్తున్నదెవరో అందరికీ తెలుసన్నారు. రైతుల పేరుతో బినామీలు యాత్ర చేస్తున్నారని ఆరోపించారు సీతారాం. ఉద్యమమంటే నిజాయితీగా చేయాలని సూచించారు. డ్రామాలు చేస్తున్నవారంతా బయటపడ్డారని అన్నారు. విశాఖ అద్భుతమైన సిటీ అని, విశాఖను రాజధానిగా ఎందుకు చేయొద్దో చెప్పాలన్నారు స్పకర్ తమ్మినేని. బంధువుల కోసం విజయవాడకు 30 కి.మీ దూరంలోని.. అమరావతిని ఎంపిక చేశారని ఆరోపించారు స్పీకర్ తమ్మినేని. ఇన్‌సైడ్ ట్రేడింగ్ ఖచ్చితంగా జరిగిందని ఆరోపించారు. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నానని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు స్పీకర్ తమ్మినేని. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా పవన్‌కు లేవన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..