Minister Avanthi Srinivasrao: పరిషత్ ఎన్నికల ఎఫెక్ట్.. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

|

Apr 05, 2021 | 8:12 PM

Minister Avanthi Srinivasrao: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి...

Minister Avanthi Srinivasrao: పరిషత్ ఎన్నికల ఎఫెక్ట్.. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
Avanthi Srinivas Rao
Follow us on

Minister Avanthi Srinivasrao: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. సోమవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన మంత్రి అవంతి శ్రీనివాసరావు.. పరిషత్ ఎన్నికల విషయంలో చంద్రబాబు చాలా గొప్పగా మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ విజయం వన్‌ సైడ్‌గా ఉంటుందని ఉహించే ఎన్నికలకు రెండు రోజుల ముందు ఎలక్షన్‌ని బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు దిగజారుడుతనానికి ఇది నిదర్శనం దుయ్యబట్టారు మంత్రి అవంతి.

ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని, ఎన్నికల బరిలో తాము ఉన్నామని క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు చెప్పటం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనం అని తూర్పారబట్టారు. టీడీపీ పోటీలో ఉన్నా.. లేకపోయినా విజయం మాత్రం వైసీపీదే అని మంత్రి అవంతి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన ఆలోచనా విధానం మార్చుకోవాలని మంత్రి హితవుచెప్పారు. లేదంటే ప్రజలే ఆయన్ను బహిష్కరించే పరిస్థితి వస్తుందంటూ ఏద్దేవా చేశారు.

ఇదే సమయంలో బీజేపీపైనా మంత్రి అవంతి శ్రీనివాస రావు ఘాటైన కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల బీజేపీది కపట ప్రేమ అని దుయ్యబట్టారు. బీజేపీకి నిజంగా రాష్ట్రం పట్ల ప్రేమ ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి సవాల్ విసిరారు. ఇదే విషయాన్ని తిరుపతి ఎన్నికల ప్రచారంలో చెప్పాలని బీజేపీని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న పవన్ కళ్యాణ్.. కనీసం స్టీల్ ప్లాంట్ గురించి అయినా మాట్లాడాలన్నారు.

Also read:

ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్నారా ? అయితే మీకోసం కొన్ని అందమైన ప్రదేశాలు… ఎక్కడున్నాయో తెలుసా..

Black Magic in Telangana: ఆదివారం అర్ధరాత్రి..కోడిని బలిచ్చి క్షుద్రపూజలు.. కోడిగుడ్లు, నిమ్మకాయలతో…

Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు.. శశికళకు ఊహించని ఝలక్.. అసలేం జరిగిందంటే..