Black Magic in Telangana: ఆదివారం అర్ధరాత్రి..కోడిని బలిచ్చి క్షుద్రపూజలు.. కోడిగుడ్లు, నిమ్మకాయలతో…

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో క్షుద్రపూజల భయంతో జనం వణికిపోతున్నారు. ఆది, బుధ గురువారాలు వచ్చిందంటే చాలు , ఊరి బయట పంట పొలాల సమీపంలో...

Black Magic in Telangana:  ఆదివారం అర్ధరాత్రి..కోడిని బలిచ్చి క్షుద్రపూజలు.. కోడిగుడ్లు, నిమ్మకాయలతో...
Black Magic
Follow us

|

Updated on: Apr 05, 2021 | 7:50 PM

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ శివారులో క్షుద్రపూజల భయంతో జనం వణికిపోతున్నారు. ఆది, బుధ గురువారాలు వచ్చిందంటే చాలు , ఊరి బయట పంట పొలాల సమీపంలో క్షుద్ర పూజలు చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆదివారం రాత్రివేళ సుల్తానాబాద్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద కోడిని బలిచ్చి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, అగరవత్తులు పెట్టి భయంకరంగా క్షుద్ర పూజలు చేశారు. తెల్లవారుజామున పొలాల వద్దకు వెళ్లే రైతులు, వాకింగ్‌కు వెళ్లేవారు గమనించి తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, అర్ధరాత్రి పూట క్షుద్రపూజలు దేనికొరకు చేస్తున్నారని, ఎందుకు చేస్తున్నారని జనం ఆందోళన చెబుతున్నారు.

ఏది ఏమైనా కరోనాకు మందు కనిపెడుతున్న ఈ రోజుల్లో ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో ప్రజలు మునిగిపోతున్నారు. క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పట్టుకుని, కేసు నమోదు చేయాలని, మూఢనమ్మకాలు, క్షుద్రపూజలపై అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇటీవల నెల్లూరు జిల్లాలో కూడా…

ఇటీవల  నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. నిధుల వేటలో క్షుద్రపూజలు జరిపి.. గుట్టుగా తవ్వకాలు జరపడాన్ని గమనించిన స్థానికులు వీఆర్వో సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వరికుంటపాడు మండలం కనియంపాడు శివారులోని చెరువు సమీపంలో అర్ధరాత్రి గుప్తనిధుల కోసం కొందరు తవ్వకాలు చేపట్టారు. ఏకంగా జేసీబీని తీసుకొచ్చి తతంగం పూర్తిచేసే ప్రయత్నం చేశారు. అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్న ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. గుట్టుగా తవ్వకాలు జరపడాన్ని గమనించి వీఆర్వో సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గుప్తనిధుల కోసం అక్కడ క్షుద్రపూజలు చేసినట్లు గుర్తించారు.

Also Read: ఆ దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా లిక్కర్.. పూజ అనంతరం ఏం చేస్తారంటే..?

ఈము పక్షులు, సైనికుల మధ్య వార్.. ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారో తెలుసా..?