Vizag Global investors summit: భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై మంత్రి అమర్నాథ్..

పరిశ్రమల శాఖా ఉన్నతాధికారులతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్ల గురించి ఆరా తీశారు మంత్రి అమర్నాథ్. ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు మంత్రి.

Vizag Global investors summit: భారీ పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యం.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై మంత్రి అమర్నాథ్..
Minister Amarnath

Edited By:

Updated on: Mar 03, 2023 | 11:48 AM

పరిశ్రమల శాఖా ఉన్నతాధికారులతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు ఏర్పాట్ల గురించి ఆరా తీశారు మంత్రి అమర్నాథ్. ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించారు మంత్రి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. 25 దేశాల నుంచి 7,500 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరు కానున్నట్లు తెలిపారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరు అవుతున్నారని తెలిపారు. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రారంభమై గరిష్ఠంగా పెట్టుబడులు పొందే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు మంత్రి. రాష్ట్ర అభివృద్ధికి, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం జరగబోయే సదస్సును విజయవంతం చేయాలని కోరుతున్నామని అమర్నాథ్ అన్నారు.

గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌పై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం లేదన్నది ప్రతిపక్షాల అర్ధరహితమన ఆరోపణలు మాత్రమేనని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు దేశం అంతా ప్రస్తుతం విశాఖ వైపు చూస్తోందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మూడేళ్లుగా మన రాష్ట్రమే మొదటి స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు ఎంపీ ఎంవీవీ. రాజధాని కూడా కాబోతున్న విశాఖలో ఈ సమ్మిట్ అద్భుతమైన విజయాన్ని నమోదు చేయబోతోందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..