Andhra Pradesh: ఆయన చనిపోయాడనుకుని అందరూ మర్చిపోయారు.. ఆ ఒక్క దృశ్యంతో ఊహించని ట్విస్ట్..

అది శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలం గేదెలవాని పేట గ్రామం. అక్కడ పరిస్థితి అంతా ఉద్వేగభరితంగా ఉంది. ఒక వ్యక్తిని గ్రామస్తులంతా ప్రత్యేకంగా చూస్తున్నారు.

Andhra Pradesh: ఆయన చనిపోయాడనుకుని అందరూ మర్చిపోయారు.. ఆ ఒక్క దృశ్యంతో ఊహించని ట్విస్ట్..
Man Identified

Updated on: Feb 16, 2023 | 4:46 PM

అది శ్రీకాకుళం జిల్లా గ్రామీణ మండలం గేదెలవాని పేట గ్రామం. అక్కడ పరిస్థితి అంతా ఉద్వేగభరితంగా ఉంది. ఒక వ్యక్తిని గ్రామస్తులంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. ముఖ్యంగా ఒక కుటుంబం అయితే ఆయన్ని ఎంతో ఆప్యాయతతో, ప్రేమతో చూస్తోంది. ఆదరిస్తోంది. చనిపోయాడనుకున్న వ్యక్తి కొన్నేళ్ల తరువాత తిరిగి సజీవంగా కళ్ల ముందు కనిపిస్తే ఇలాగే ఉంటుంది కదా పరిస్థితి. మరి ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏం జరిగింది? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గేదెలవానిపేట గ్రామానికి చెందిన సాధు కామరాజు, ఆయన కుటుంబం తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కామరాజు తాపీ పని నిమిత్తం తిరుపతి వెళ్తుండా ఏమరపాటుగా నెల్లూరు రైల్వే స్టేషన్‌లో దిగిపోయారు. ఫలితంగా ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి రోజులు గడిచినా రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. గ్రామస్తుల సహకారంతో కూడా వెతికే ప్రయత్నం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే, అప్పటికి కామరాజు ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. మాట్లడలేడు, ఏదీ సరిగా చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఆయన కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు కష్టమైంది. అదే సమయంలో 2019లో లాక్ డౌన్ పడటం, ప్రయాణాలు బంద్ అవడంతో.. ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు కామరాజు చనిపోయాడని అంతా భావించారు. కానీ, నాలుగేళ్ల తరువాత సీన్ మారిపోయింది. చనిపోయాడనుకున్న కామరాజు.. తిరిగి ఇంటికి చేరాడు.

నెల్లూరు జిల్లా కావలిలో ఉన్న కామరాజును యూట్యూబర్ మాలిని గమనించారు. అతని పరిస్థితికి చలించిపోయిన మాలిని.. కామరాజుపై వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా సర్క్యూలేట్ అవడంతో చివరకు గేదెలవానిపేట గ్రామానికి చెందిన సాధు అప్పలనాయుడు కంట పడింది. వెంటనే అతను మాలినిని సంప్రదించాడు. కామరాజు వివరాలు తెలుసుకుని స్వగ్రామానికి తీసుకువచ్చారు. చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి నాలుగేళ్ల తరువాత ఇంటికి రావడంతో ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే.. కామరాజును చేరదీసి, అతను స్వగ్రామానికి తిరిగి రావడానికి కారణమైన మాలినిని గ్రామస్తులంతా సత్కరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..