JD Lakshminarayana: ‘నాడు సమాజంలో.. నేడు పొలంలో..’ కలుపు మొక్కల ఏరివేతలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ.. పొలంలో రైతులా నాట్లు వేస్తూ..
మాజంలో కలుపు మొక్కలను ఏరిపారేసిన జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలను ఏరుపారేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం తెనాలి మండలం అత్తోట గ్రామంలోని భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో జేడీ లక్ష్మీనారాయణ రైతులా దర్శనమిచ్చారు. నాట్లు వేశారు, వ్యవసాయ క్షేత్రంలోనే మిగతా రైతులతో ఆటపాట చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఫ్యాంట్ షర్టులతో కనిపించే జేడీ లక్ష్మీనారాయణ..

గుంటూరు, సెప్టెంబర్ 6: సమాజంలో కలుపు మొక్కలను ఏరిపారేసిన జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలను ఏరుపారేసే పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం తెనాలి మండలం అత్తోట గ్రామంలోని భూమి భారతి వ్యవసాయ క్షేత్రంలో జేడీ లక్ష్మీనారాయణ రైతులా దర్శనమిచ్చారు. నాట్లు వేశారు, వ్యవసాయ క్షేత్రంలోనే మిగతా రైతులతో ఆటపాట చేస్తూ ఉల్లాసంగా గడిపారు. ఫ్యాంట్ షర్టులతో కనిపించే జేడీ లక్ష్మీనారాయణ అచ్చ తెలుగు రైతులా తలపాగా, లుంగీ, బనియన్, టవల్ ధరించి వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేస్తుంటే ఎవరూ గుర్తించలేని విధంగా తయారయ్యారు.
పదవిలో ఉన్నప్పుడు అవినీతి కలుపు మొక్కలు ఏరిపారేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ తర్వాత కూడా వ్యవసాయంలో కలుపు మొక్కలు ఏరివేసే పనిలో నిమగ్నమయ్యారు. అచ్చ తెలుగు రైతులా మారి వ్యవసాయం చేస్తూ అత్తోట గ్రామ రైతులు గ్రామస్తులు పిల్లలతో హాయిగా గడిపారు. మరోవైపు కృష్ణాష్టమి కూడా తోడవడంతో వ్యవసాయ క్షేత్రంలోని ఉట్టి కొట్టారు జేడి లక్ష్మీనారాయణ. రైతులతో కలిసి ఆట పాటలల్లో పాల్గొన్నారు. రైతులతో కలిసి మెలిసి ఉన్న జేడీ లక్ష్మీనారాయణ రాకతో అత్తోట గ్రామంలో ఈ కృష్ణాష్టమి ప్రత్యేకత సంతరించుకుంది.
పిల్లలకి వ్యవసాయం అంటే ఏమిటో నేర్పించాలి… నారుమడి, వరి చేను, నాట్లు ఎలా వేస్తాం, తదితరు విషయాలను స్కూల్ పిల్లలకు తెలియజేసేందుకు, ప్రాక్టికల్ గా చూపించేందుకు ఈ వ్యవసాయ క్షేత్రంలో నాట్లు వేసినట్లు చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ. నేటి తరం పిల్లలకు బియ్యం ఎలా తయారవుతుందో తెలియకపోవటం చాలా బాధాకరమని వారిలో చైతన్యం కలిగించేందుకే తాను ఇలా రైతులా మారినట్టు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం వంటి విషయాలు తెలియజేసేందుకు ఇదొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా భూమి భారతిని చెప్పుకొచ్చారు. రసాయనక ఎరువుల వల్ల ఆహార పదార్థాల్లో కాలుష్యం పెరిగిపోయిందని, అందువల్ల గోఆదారిత ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రాబోయే తరాల వారికి కలుషితం లేని ఆహార పదార్థాలను అందించగలమని చెప్పారు జేడీ లక్ష్మీనారాయణ.
కాగా ఏపీ రాజకీయాల్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చురుగ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. జనాల్లోకి వెళ్లి వారి కష్టనష్టాల గురించి ఆరా తీస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలో నేడు గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం అత్తోట గ్రామంలో పొలంలో వ్యవసాయం చేస్తూ కనిపించారు. పాఠశాల విద్యార్ధులకు వ్యవసాయం గురించి చెప్పేందుకు పొలంలో నాట్లు వేశారు. ఈక్రమంలో అక్కడి రైతులతో కలిసి సరదాగా గడిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.