Andhra Pradesh: ‘చచ్చి దయ్యమై పీడిస్తా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను’.. సంచలనం సృష్టిస్తున్న యువతి సూసైడ్ లెటర్..

| Edited By: Shiva Prajapati

Aug 29, 2023 | 12:38 PM

క్లాస్ లో టాపర్ అయినా స్నేహ విజయవాడ అంబాపురం లో ఉంటూ కేబిఎన్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొద్దీ రోజులుగా కళాశాలకు రావటం మానేసిన స్నేహ క్లాస్ 8 గంటలకైతే 6 గంటలకే వాకర్స్ తో కాలేజ్ లోకి వెళ్లి 4 వ అంతస్తు నుండి కిందకు దూకేసింది. అది గమనించిన వాకర్స్ ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 4 వ అంతస్తు నుండి దూకటంతో తీవ్ర గాయాలైన స్నేహ కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 24 గంటలైతే కానీ కండిషన్ చెప్పలేం అంటున్నారు వైద్యులు.

Andhra Pradesh: ‘చచ్చి దయ్యమై పీడిస్తా.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టను’.. సంచలనం సృష్టిస్తున్న యువతి సూసైడ్ లెటర్..
Love Failure
Follow us on

ప్రేమలో విఫలం అయ్యి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కలశాల బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని ప్రేమిస్తున్నాడంటూ మనస్తాపానికి గురై కొద్దీ కాలంగా కళాశాలకు వెళ్ళటం మానేసిన విద్యార్థిని నిన్న ఉదయం కళాశాల నాలుగోవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.

క్లాస్ లో టాపర్ అయిన స్నేహ విజయవాడ అంబాపురంలో ఉంటూ కేబిఎన్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. కొద్ది రోజులుగా కళాశాలకు రావటం మానేసిన స్నేహ.. క్లాస్ 8 గంటలకైతే 6 గంటలకే వాకర్స్‌తో కాలేజ్ లోకి వెళ్లి 4 వ అంతస్తు నుండి కిందకు దూకేసింది. అది గమనించిన వాకర్స్ ఆమెను హుటాహుటిన ఆస్పత్రిలో జాయిన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 4 వ అంతస్తు నుండి దూకటంతో తీవ్ర గాయాలైన స్నేహ కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 24 గంటలైతే కానీ కండిషన్ చెప్పలేం అంటున్నారు వైద్యులు.

ఇక స్నేహ ఆత్మహత్యకు ప్రేమలో విఫలం అవ్వటమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇంటి దగ్గరే ఒక యువకుడిని ప్రేమించిన స్నేహ కొంత కాలంగా అతను మరో యువతిని ప్రేమించటంతో మనస్థాపానికి గురైన స్నేహ కాలేజ్‌కు వెళ్ళటం కూడా మానేసింది. దిగులుగా ఆరోగ్యం బాగోలేక ఇంటి వద్దే ఉంటూ నిన్న చనిపోవాలనుకుని 11 పేజీల సూసైడ్ నోట్ కూడా రాసింది. ‘ప్రేమలో విఫలం అయ్యాను. నేను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని ప్రేమిస్తున్నాడు. నాకు చదువుపై ఇంట్రెస్ట్ లేదు. నాతప్పు లేకున్నా ఇంట్లో నన్నే నిందిస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టిన వారిని చనిపోయి దెయ్యమై పీడిస్తా’ అంటూ లేఖలో రాసింది స్నేహ. ఈ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ఏలూరు లో పెయింటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం గా మారింది. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు హతురాలు సుజాత,ఆత్మహత్య చేసుకున్న సత్యనారాయణ లకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు వైద్యులు. ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..