ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ఇప్పటికే వెల్లడించారు.
ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదలకు సంబంధించి ఏపీ సర్కార్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టింది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఏపీ సర్కార్ మాత్రం చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే ఉద్దేశంతోనే ముందుకుసాగింది. కానీ.. సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.
10th తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్ మార్కుల కోసం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఇంటర్మిడియట్ బోర్డు ఇప్పటికే వివరణ ఇచ్చింది.