AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో చూస్తే..

మనుషుల మధ్య గ్యాంగ్ వార్లను సినిమాల్లో చూసుంటారు.. కానీ నడిరోడ్డుపై కోతుల మధ్య పక్కా ప్లాన్‌‌తో గ్యాంగ్ వార్ జరగడం ఎప్పుడైనా చూశారా? వందలాది కోతులు రెండు గ్రూపులుగా విడిపోయి, ఒకదానిపై ఒకటి భీకరంగా దాడులు చేసుకుంటూ వీధులను రణరంగంగా మార్చేశాయి. వాటి అరుపులు, చేష్టలు చూసి ఊరికి ఊరే గడగడలాడిపోయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో చూస్తే..
Monkeys Clash On The Streets
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 29, 2026 | 8:53 PM

Share

సాధారణంగా సినిమాల్లోనో, రౌడీ మూకల మధ్యనో గ్యాంగ్ వార్లను చూస్తుంటాం. కానీ మార్కాపురం జిల్లాలో విచిత్రమైన, భయానకమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కోతులు రెండు వర్గాలుగా విడిపోయి నడిరోడ్లపైనే పరస్పరం దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్‌ను తలపిస్తున్నాయి. వందలాదిగా తరలివచ్చిన వానర సైన్యం ఊరి వీధులను రణరంగంగా మార్చడంతో స్థానిక ప్రజలు గడప దాటాలంటేనే వణికిపోతున్నారు. దోర్నాలలోని అమ్మవారి శాల వీధిలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. వేర్వేరు ప్రాంతాల నుంచి ఆహారం కోసం వచ్చిన వందలాది కోతులు ఒక్కసారిగా రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఒక గుంపుపై మరో గుంపు భీకరంగా దాడికి దిగింది. కోతుల వికృత చేష్టలు, భీకరమైన అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

రోడ్లపై సాగిన ఈ భీకర పోరాటాన్ని చూసిన స్థానికులు భయంతో ఇళ్లకు తాళాలు వేసుకుని లోపలే ఉండిపోయారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లలేక, పెద్దలు పనులకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒక వీధిలో ఇటువంటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయని, అడ్డువచ్చిన మనుషులపై కూడా కోతులు దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు లబోదిబోమంటున్నారు.

అడవిలో ఆకలి.. ఊళ్లపై దండయాత్ర

నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. సరైన వర్షాలు కురవకపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలో సహజ నీటి వనరులు, పండ్ల చెట్లు ఎండిపోయాయి. తాగునీరు, తిండి దొరక్కపోవడంతో కోతులు గుంపులు గుంపులుగా గ్రామాల వైపు వలస వస్తున్నాయి. స్థానికంగా ఉండే కోతులకు, బయటి అటవీ ప్రాంతాల నుంచి వచ్చిన కోతులకు మధ్య ఆహారం, ఆధిపత్యం కోసం తీవ్రమైన ఘర్షణలు తలెత్తుతున్నాయి. కేవలం దోర్నాల మాత్రమే కాకుండా నల్లమల సరిహద్దు మండలాలైన యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు పరిసర ప్రాంతాల్లోనూ ఇదే రీతిలో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది.

చర్యలు తీసుకోవాలని అధికారులకు వేడుకోలు

రోజురోజుకూ కోతుల ఆగడాలు మితిమీరిపోతుండటంతో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పంచాయతీ అధికారులు, అటవీ శాఖ యంత్రాంగం వెంటనే స్పందించి బోన్లు ఏర్పాటు చేయాలని, ఊళ్లపై పడుతున్న కోతుల గుంపులను పట్టుకుని దట్టమైన అటవీ ప్రాంతంలోకి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
ఇదెక్కడి కొట్లాట రా సామీ.. కోతుల మధ్య గ్యాంగ్ వార్.. వీడియో
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు..
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు!
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్‌ను గోల్డెన్ లేగ్ మార్చిన రాఘవేంద్రరావు..
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
పెరుగు పుల్లగా మారిందా? డస్ట్‌బిన్‌లో వేయకండి.. ఇలా చేయండి!
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
సన్‌ఫ్లవర్ నూనె vs పల్లీ నూనె.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
పెద్ద కుమారుడే అంత్యక్రియలు ఎందుకు నిర్వహిస్తారు? గరుడ పురాణం...
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
జాతకంలో లక్ష్మీ యోగం ఉంటే ఇన్ని ప్రయోజనాలా?
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..
స్వీట్ షాప్ నడిపి ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ డైరెక్టర్ గా ఎదిగి..