Nara Lokesh Bail Petition: హైకోర్టులో నారా లోకేష్‌కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ..

|

Sep 29, 2023 | 12:21 PM

IRR Amaravati Case: అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు ధర్మాసనం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించింది కోర్టు.

Nara Lokesh Bail Petition: హైకోర్టులో నారా లోకేష్‌కు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ..
Nara Lokesh
Follow us on

IRR Amaravati Case: అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బిగ్ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఆయన బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు ధర్మాసనం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించింది కోర్టు. కాగా, ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో నారా లోకేష్‌కు 41 ఏ నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులను స్వయంగా ఆయనకే ఇచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరారు ఏపీ సీఐడీ అధికారులు. ఇదే అంశంపై ఆరుగురు సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. అలాగే తమ వెంట చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఫైల్స్‌ను కూడా తీసుకెళ్లారు సీఐడీ అధికారులు.

స్కిల్ స్కామ్‌లో లోకేష్ బెయిల్ పిటిషన్..

ఈ కేసుతో పాటు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు నారా లోకేష్. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్ పిటిషన్‌ అత్యవసరంగా విచారించాలని హైకోర్టును కోరారు లోకేష్ తరఫున న్యాయవాదులు. ఈ పిటిషన్‌ మధ్యాహ్నం సమయానికి హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్..

చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు సెంట్రల్‌ జైలుకు చేరుకున్నారు ఆయన సతీమణి నారా భువనేశ్వరి. ఆమెతోపాటు నారా బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. 45 నిమిషాల పాటు ములాఖత్ అవుతారు. ఇప్పటికే చంద్రబాబుతో మూడుసార్లు ములాఖత్ అయ్యారు భువనేశ్వరి.

టీడీపీ నేతల ఆరోపణల్లో వాస్తవం లేదు..

స్కిల్‌ స్కీం జీవోలో సింహపురి వర్శిటీకి సంబంధం లేదని మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నుంచి మాట్లాడిన కాకాణి సింహపురి వర్శిటీకి స్కిల్‌ డెవలప్‌మెంట్ 2022లో వచ్చిందని వివరించారు. అది కూడా ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిందే అన్నారు. రూ.330 కోట్లు దోచేశారని చంద్రబాబుపై వచ్చిన అభియోగాలు టీడీపీ నేతలు తప్పనడం హాస్యాస్పదమన్నారు. టీడీపీ నేతల ఆరోపణలో నిజం లేదని కాకాణి తేల్చి చెప్పారు. టెండర్లు లేకుండా డబ్బులు దోచేయాలని బాబు ప్లాన్ వేశారన్నారు. ఒరిజినల్ సీమెన్స్ కి దీనికి సంబంధం లేదని వెల్లడించారు. ఈ స్కాంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ చెప్పిందని మంత్రి గుర్తు చేశారు. నిజానికి ఒక్కో స్కిల్ సెంటర్ కు రూ. 80 కోట్లు ఖర్చు పెట్టాలన్నారు. కానీ 40 సెంటర్లలో ఎక్కడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు కాకాణి. స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో చంద్రబాబు యువతను మోసం చేశారని, స్కిల్ స్కాంలో బాబు చెప్పేవన్నీ కట్టుకథలేనని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..