- Telugu News Photo Gallery Canada Aviation Company to set up Aircraft Repair and Maintenance Center at Tirupati International Airport
Tirupati Airport: తిరుపతి ఎయిర్‌పోర్టుకు రానున్న విమానాల మరమ్మతు నిర్వహణ కేంద్రం
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు, నిర్వహణ చేపట్టేందుకు ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖా మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరపగా ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ ముందుకొచ్చింది..
Updated on: Sep 29, 2023 | 11:16 AM

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు, నిర్వహణ చేపట్టేందుకు ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖా మంత్రితో పలుమార్లు సంప్రదింపులు జరపగా ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల మరమ్మతు నిర్వహణ కేంద్రం ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ ముందుకొచ్చింది.

గతంలో హైదరాబాద్ లో జరిగిన ఇన్వెస్ట్ ఇండియా శిఖరాగ్ర సమావేశం వేదికగా ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు కోసం ఔత్సాహిక కంపెనీలను ఆహ్వానించగా కెనెడా ఏవియేషన్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు టెండర్ ప్రక్రియలో పాల్గొంది.

ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన కెనెడా ఏవియేషన్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇన్వెస్ట్ ఇండియా ప్రతినిధులు తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌళిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం విమానాశ్రయం సమీపంలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ని సందర్శించారు. ఈ మేరకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో తిరుపతిలో భేటీ అయ్యారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పెద్ద నగరాలతో దీటుగా తిరుపతి నగరాన్ని, తిరుపతి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకుగాను రూపొందించబడిన ప్రణాళికలో భాగంగానే తిరుపతి విమానాశ్రయంలో ఎమ్మారో సెంటర్ ఏర్పాటు జరుగుతోందన్నారు.

ఈ మేరకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎమ్మారో సెంటర్ ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. రానున్న 6 నెలల్లో ఎమ్మార్వో సెంటర్ ఏర్పాటు అవుతుందన్న ఆశాభావాన్ని ఎంపీ గురుమూర్తి వ్యక్తం చేసారు. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు ఎంపీ గురుమూర్తి.
