AP Governor Biswabhusan: కరోనా బారిన పడ్డ ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. AIG ఆస్పత్రి వైద్యులు తాజాగా హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడిందని తాజా బులిటిన్‌లో వైద్యులు వెల్లడించారు. కోవిడ్ తో హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. సాధారణ స్థితిలో ఆక్సిజన్ స్థాయిలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఏఐజీ హాస్పిటల్ లోని వైద్య బృందం పర్యవేక్షణలో గవర్నర్‌కి వైద్య చికిత్స అందిస్తున్నారు.
88 ఏళ్ల వయసున్న గవర్నర్ బిబి హరిచందన్.. నవంబర్ 17న మధ్యాహ్నం ఒంటి గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో చేరారు. గవర్నర్‌కు నవంబర్ 15వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నామని.. ఆయన కోలుకుంటున్నారని AIG ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ తరవాత ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ ఏపీ గవర్నర్ అయ్యారు. 2019 జూలై నుంచి ఏపీ గవర్నర్‌గా విధుల్లో వున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 87 ఏళ్లు. సుదీర్ఘమయిన రాజకీయ అనుభవం ఆయన స్వంతం. రాజకీయ నాయకుడిగానే కాకుండా లాయర్‌గా, రచయితగానూ ఆయన గుర్తింపు ఉంది.
ఇవి కూడా చదవండి: Skin Care Tips: చలికాలంలో డ్రై స్కిన్‌తో బాధపడుతున్నారా.. అద్భుమైన చిట్కా మీకోసం.. ఇంట్లోనే చేసుకోండిలా..
MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో