ఏపీలో పెన్షనర్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో పింఛను మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలనెలా 2,250ల చొప్పున పింఛను ఇస్తుండగా.. ఇకపై దాన్ని 2,500లకు పెంచి ఇవ్వనుంది. వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత తదితర విభాగాలకు చెందిన సామాజిక పెన్షన్లను 2,250 నుంచి 2500కు పెంపుదల చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబరు నుంచి ఈ పెంపుదల వర్తిస్తుందని 2022 జనవరి 1 తేదీన పెరిగిన మొత్తంతో పెన్షన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్సార్ పెన్షన్ కానుకలో భాగంగా ఇస్తున్న సామాజిక పెన్షన్లలో ఈ పెంపుదలను వర్తింప చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా 129 కోట్ల రూపాయల మేర భారం పడుతుందని వివరించారు.
జనవరిలోనే రైతు భరోసా సాయం…
జనవరిలలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను అధికారులు వెల్లడించారు. 2021 జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు చేయనున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా అగ్రవర్ణ నిరుపేద మహిళలకు లబ్ధి చేకూర్చనున్నారు. 45 నుంచి 60 ఏళ్లు ఉన్న మహిళలకు మూడేళ్లలో 45వేలు చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే, జనవరిలోనే రైతు భరోసా సాయం ఇవ్వనున్నట్టు తెలిపారు. రైతు భరోసా సాయం తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు.
Also Read: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్