Andhra Pradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అలా చేసినా అకౌంట్లోకి డబ్బులు.. కీలక ఆదేశాలు జారీ

ఏపీలో అమలవుతున్న దీపం పథకంపై చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. వారికి అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీపై గుడ్ న్యూస్ తెలిపారు. గ్యాస్ సరఫరా, దీపం పథకం అమలుకు సంబంధించి అధికారులతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

Andhra Pradesh: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. అలా చేసినా అకౌంట్లోకి డబ్బులు.. కీలక ఆదేశాలు జారీ
Gas Cylinder Delivery

Updated on: Apr 11, 2026 | 8:29 AM

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్న విషయం తెలిసిందే. దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేస్తోంది. గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ అయిన తర్వాత 48 గంటల్లోనే లబ్దిదారుల అకౌంట్లో సొమ్మును జమ చేస్తోంది. అయితే ఈ పథకంకు సంబంధించి కూటమి సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. దీపం పథకం లబ్దిదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్‌ కనెక్షన్‌లోకి మారినప్పటికీ.. ఎప్పటిలాగే రాయితీ కొనసాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో వంట గ్యాస్ సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీపం పథకం లబ్దిదారులకు ఊరట కలిగించేలా కీలక ఆదేశాలు ఇచ్చారు.

అలా చేసినా సబ్సిడీ

దీపం పథకం లబ్దిదారులు పీఎన్‌జీలోకి మారినా రాయితీ సొమ్మును వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే ప్రభుత్వపరంగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ఈ సందర్బంగా పీఎన్‌జీ కనెక్షన్లపై ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. వచ్చే ఆరు నెలల్లో 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుంది. ఇక శ్రీకాకుళం-కాకినాడ సహజవాయువు పైప్ లైన్‌కు సంబంధించి పనులు వేగంగా పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలన్నారు. టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా.. త్వరగా పనులు మొదలుపెట్టేలా చూడాలని తెలిపారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. పైప్ లైన్ పనులు వేగవంతంగా చేయాలని కోరారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు చేపడతామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రివ్యూ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటుందని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు.

దీపం పథకం ఎవరికి..?

రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి దీపం పథకం అమలు చేస్తున్నారు. దీని ద్వారా ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తోంది. ప్రతి నాలుగు ఒక సిలిండర్ ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన వారికి మాత్రమే అకౌంట్లలో నిధులు జమ అవుతాయి. దీంతో దీపం పథకం లబ్దిదారులందరూ ఈకేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతీ ఏడాదిలో ఒకసారి కేవైసీ ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార్, మొబైల్ నెంబర్ ఉంచే సరిపోతుంది. ఆధాత్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కేవైసీ పూర్తి అవుతుంది. ఆన్ లైన్ ద్వారా కూడా మీరు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

Follow Us