Ration: రేషన్ బదులు డబ్బులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో..

|

Apr 13, 2022 | 8:49 AM

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ ఇచ్చే విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ఎవరైనా రేషన్ వద్దనుకుంటే వారికి డబ్బులు ఇచ్చేందుకు సమాయత్తమైంది. డబ్బులు వద్దనుకుంటే సరకులు...

Ration: రేషన్ బదులు డబ్బులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి మాత్రం నో..
fortified rice
Follow us on

ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రేషన్ ఇచ్చే విధానంలో స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ఎవరైనా రేషన్ వద్దనుకుంటే వారికి డబ్బులు ఇచ్చేందుకు సమాయత్తమైంది. డబ్బులు వద్దనుకుంటే సరకులు తీసుకోవచ్చు. మే నెల నుంచి ఈ నగదు బదిలీ కార్యక్రమం అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని భావించి, ఆ తరువాత విరమించుకున్న నగదు బదిలీ విధానాన్ని ఇప్పుడు జగన్ ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. నగదు బదిలీకి అంగీకరించిన కార్డుదారులకు బియ్యానికి బదులుగా ప్రతి నెలా నగదు పంపిణీ చేస్తారు. ఈ విధానాన్ని అనకాపల్లి, గాజువాక, నర్సాపురం, నంద్యాల, కాకినాడ ల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం దశల వారీగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తారు. ఈ విధానంపై ఈ నెల 18 నుంచి 22 వరకు వాలంటీర్ల ద్వారా అంగీకార పత్రాలు తీసుకుంటారు. 23న వీఆర్వో పరిశీలన, 25న తహసీల్దార్‌ ఆమోదం తీసుకుంటారు. కార్డుదారులకు కిలోకు ఎంత ఇవ్వాలనేది ఇంకా నిర్ణయించలేదు. రూ. 12 నుంచి రూ.15 మధ్య ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

బియ్యానికి బదులు నగదు ఇచ్చే విధానంపై ముందుగా కార్డుదారుల అభిప్రాయం తీసుకుంటారు. వారు అంగీకరిస్తే డబ్బులు ఇస్తారు. ఒకవేళ రెండు నెలలు తీసుకున్నా.. ఆ తర్వాతి నెలలో బియ్యం కావాలంటే తీసుకోవచ్చు. వాలంటీర్ల ద్వారా నగదు అందించాలని అధికారులు భావిస్తున్నారు. నగదు బదిలీ విధానం ద్వారా రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం అందించే కార్డుదారులకు మాత్రమే నగదు బదిలీ వర్తిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం కార్డుదారులైన అన్నపూర్ణ, అన్న యోజన కార్దుదారులకు ఈ విధానం వర్తించదు. వాస్తవానికి కిలో బియ్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీగానే ఖర్చు చేస్తోంది. అయితే నగదు బదిలీ పథకం కింద ఎంత మేర డబ్బులు జమ చేస్తుందో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నగదు తీసుకునే వారు బ్యాంకు ఖాతా వివరాలను వాలంటీర్లకు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.

Also Read

Team India: క్రెడిట్ అంతా ధోనీదేనా.. మిగిలిన 10 మంది లస్సీ తాగారా?: భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Bank Alert: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇన్ని నష్టాలా.. వెంటనే జాగ్రత్త పడండి..