Bank Alert: ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఇన్ని నష్టాలా.. వెంటనే జాగ్రత్త పడండి..
Bank Alert: సాధారణంగా చాలా మంది తవసరం కోసం బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేసి తరువాత వాటిని వాడటం మానేస్తుంటారు. అలా చేయటం వల్ల ఉండే నష్టాల గురించి చాలా మందికి తెలియదు. దీని వల్ల ఉండే ఆర్థిక నష్టాల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
Bank Alert: రామోజీ చాలా తరచుగా కంపెనీలను మారుతుంటాడు. దీని కారణంగా అతని పేరుపై ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు(Many bank accounts) ఉన్నాయి. ఇటీవల అతను టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు.. సీఏ (Chartered Accountant) అతనిని అన్ని బ్యాంకు అకౌంట్ల స్టేట్‌మెంట్ల చూపించమని అడగడంతో రామోజీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన పేరుపై ఉన్న చాలా బ్యాంకు అకౌంట్లలో రామోజీ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయలేదు. దీని కారణంగా తాను ఆర్థికంగా చాలా నష్టపోయినట్లు రామోజీకి అర్థమైంది. మీరు ఎక్కువ సంఖ్యలో బ్యాంకు అకౌంట్లను తెరిచి ఉంటే.. వెంటనే వాటిని మూసివేయండి. లేదంటే.. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు మీకు జరిమానా విధించబడవచ్చు. సాధారణంగా మూడు నెలలపాటు జీతం క్రెడిట్ అవ్వకపోతే బ్యాంకులు శాలరీ అకౌంట్లను సాధారణ పొదుపు ఖాతాలుగా మారుస్తాయి. రామోజీ ఇంతకముందు పనిచేసిన సంస్థల్లోని శాలరీ అకౌంట్లు ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లుగా మారిపోయాయి. ఇప్పుడు ఈ సేవింగ్స్ అకౌంట్లపై వివిధ రకాల సర్వీస్ ఛార్జీలు బ్యాంకులు విధిస్తున్నాయి. దీనితో పాటు ప్రతి క్వార్టర్ లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయనందుకు జరిమానా కూడా విధించాయి. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల ఉండే నష్టాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..
Koo India: ఎలాన్ మస్క్‌కు Koo సీఈవో ట్వీట్.. అందుకు సిద్ధమన్న దేశీయ స్టార్టప్..