AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ధోనీ కప్ తెస్తే.. మిగిలిన 10 మంది లస్సీ తాగేందుకు వెళ్లారా?: భారత మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు

2011 World Cup: గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చాలా మంది కెప్టెన్ ధోనీ మాత్రమే క్రెడిట్ ఇస్తున్నారంటూ టీమిండిమా మాజీ స్పిన్నర్ వాపోయాడు.

Team India: ధోనీ కప్ తెస్తే.. మిగిలిన 10 మంది లస్సీ తాగేందుకు వెళ్లారా?: భారత మాజీ స్పిన్నర్ ఘాటు వ్యాఖ్యలు
2011 World Cup Team India
Venkata Chari
|

Updated on: Apr 13, 2022 | 10:20 AM

Share

టీమ్ ఇండియా చివరిసారిగా 2011లో క్రికెట్ ప్రపంచకప్(2011 World Cup) టైటిల్‌ను గెలుచుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఆఖరి మ్యాచ్‌లో కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) అజేయంగా 91 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే, ఈ సమయంలో నువాన్ కులశేఖర బంతికి ధోని కొట్టిన విన్నింగ్ సిక్స్ భారత అభిమానుల మదిలో గుర్తుండిపోయేలా చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చాలా మంది ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించిన ఘనత ఎంఎస్ ధోనీకి ఇస్తున్నారంటూ.. ఆ ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమైన స్పిన్నర్ హర్భజన్ సింగ్(harbhajan singh) కీలక వ్యాఖ్యలు చేశాడు.

ధోనీదేనా క్రెడిట్ అంతా..

హర్భజన్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, ‘ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిస్తే, ఆస్ట్రేలియా ప్రపంచకప్ గెలిచిందని అందరూ అంటారు. అప్పట్లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంఎస్ ధోనీ వరల్డ్ కప్ గెలిచాడని అన్నారు. అయితే మిగతా 10 మంది లస్సీ తాగేందుకు అక్కడికి వెళ్లారా? మిగతా 10 మంది ఆటగాళ్లు ఏం చేశారు? గౌతమ్ గంభీర్ ఏం చేశాడు? మరికొందరు ఏం చేశారో తెలియదా? ఇది టీమ్ గేమ్. 7-8 మంది ఆటగాళ్లు బాగా ఆడినప్పుడు మాత్రమే ఏ జట్టైనా విజయాలు సాధిస్తుందని’ పేర్కొన్నాడు.

రెండేళ్ల క్రితం, గౌతమ్ గంభీర్ కూడా ఎంఎస్ ధోని గెలిచిన సిక్స్‌ను చూపించే సోషల్ మీడియా పోస్ట్‌పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మొత్తం భారతదేశం, మొత్తం భారత జట్టు, అందరి మద్దతుతో 2011 ప్రపంచకప్ గెలిచిందని గంభీర్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.

గంభీర్ 97 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్..

చివరి మ్యాచ్‌లో 79 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. కానీ, గౌతమ్ గంభీర్ జట్టు తరపున అత్యధికంగా 97 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలో రెండు వికెట్లు పడిన తర్వాత, గంభీర్ విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. గంభీర్‌ను తిసారా పెరీరా అవుట్ చేయగా, ఆ తర్వాత ధోనీ యువరాజ్ సింగ్‌తో కలిసి జట్టును విజయ ద్వారం వద్దకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Also Read: IPL 2022: 5 మ్యాచ్‌లు.. 207 పరుగులు.. కోహ్లీ టీంపై రివెంజ్ ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ లిస్టులో దూసుకొచ్చిన బ్యాటర్ ఎవరంటే?

IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో బెంగళూర్‌దే హవా.. టాప్ లిస్టులో ఎవరున్నారంటే?