IPL 2022: 5 మ్యాచ్‌లు.. 207 పరుగులు.. కోహ్లీ టీంపై రివెంజ్ ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ లిస్టులో దూసుకొచ్చిన బ్యాటర్ ఎవరంటే?

ఈ ఆటగాళ్లలో కొందరు ఆరెంజ్ క్యాప్ (IPL Orange Cap) రేసులో దూసుకొస్తున్నారు. ఇప్పటి వరకు జోస్ బట్లర్ అగ్రస్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మ్యాచ్ తర్వాత..

IPL 2022: 5 మ్యాచ్‌లు.. 207 పరుగులు.. కోహ్లీ టీంపై రివెంజ్ ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ లిస్టులో దూసుకొచ్చిన బ్యాటర్ ఎవరంటే?
Ipl 2022 Orange Cap
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2022 | 8:19 AM

IPL 2022 ప్రారంభమై రెండు వారాలు దాటింది. ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌ల్లో షాకింగ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. కొందరు పాత ఆటగాళ్లు మళ్లీ తమ కీర్తిని చాటుతూ వారి జట్లకు విజయాన్ని అందిస్తున్నారు. ఈ ఆటగాళ్లలో కొందరు ఆరెంజ్ క్యాప్ (IPL Orange Cap) రేసులో దూసుకొస్తున్నారు. ఇప్పటి వరకు జోస్ బట్లర్ అగ్రస్థానంలో నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (CSK vs RCB) మ్యాచ్ తర్వాత, ఏ బ్యాట్స్‌మెన్ కూడా బట్లర్‌ను అధిగమించలేకపోయాడు. అయితే చెన్నైకి చెందిన శివమ్ దూబే, రాబిన్ ఉతప్ప(Shivam Dube and Robin Uthappa) మెరుపు ఇన్నింగ్స్‌తో బట్లర్‌తో అంతరాన్ని తగ్గించుకున్నారు.

రాజస్థాన్ రాయల్స్ లెజెండరీ ఇంగ్లీష్ ఓపెనర్ జోస్ బట్లర్ వారం రోజుల పాటు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన బట్లర్ 4 ఇన్నింగ్స్‌ల్లో అత్యధికంగా 218 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే, అతడు మినహా శివమ్ దూబే మాత్రమే 200 పరుగుల మార్క్‌ను అందుకోగలిగాడు. అయితే స్వల్ప మార్జిన్‌తో ఆరెంజ్ క్యాప్ బట్లర్ తలపై ప్రస్తుతానికి నిలిచిపోతుంది.

బట్లర్ దరికి చేరిన దూబే..

బెంగళూరుపై CSK తరపున శివమ్ దూబే, రాబిన్ ఉతప్ప భీభత్సం చేశారు. వీరిద్దరూ కలిసి మొత్తం 17 సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో తొలిసారిగా CSK తరపున ఆడుతున్న శివమ్ దూబే అద్భుత ప్రదర్శన చేస్తూ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 207 పరుగులు సాధించాడు. బట్లర్ కంటే కేవలం 11 పరుగులు వెనుకబడి ఉన్నాడు. అదే సమయంలో, వెటరన్ బ్యాట్స్‌మెన్ ఉతప్ప 9 సిక్సర్ల సహాయంతో 88 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం 194 పరుగులు చేసి ఈ రేసులో మూడో స్థానంలో నిలిచాడు.

ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత, అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌కు ఆరెంజ్ క్యాప్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును మొదటి సీజన్‌ నుంచి అందజేస్తున్నారు. అయితే, టైటిల్ గెలిచిన జట్టులోని ఆటగాడు ఆరెంజ్ క్యాప్ అందుకోవడం ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే జరిగింది. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిపిన రాబిన్ ఉతప్ప ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 635 పరుగులతో అవార్డును గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో ఇద్దరు ఆటగాళ్లు చెన్నైలో ఉన్నప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు. ఉతప్ప 4 ఇన్నింగ్స్‌ల్లో 106 పరుగులు చేయగా, గైక్వాడ్ 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

Also Read: IPL 2022 Purple Cap: పర్పుల్ క్యాప్‌లో బెంగళూర్‌దే హవా.. టాప్ లిస్టులో ఎవరున్నారంటే?

IPL 2022: 4 సార్లు ఓడినా.. ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేన.. చెన్నైలా ముంబై విజయాల ఖాతా తెరిచేనా?