
కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటపై విచారణకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి శేష శయన రెడ్డితో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్.. గతేడాది డిసెంబర్ 28న కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన, ఈ నెల 1వ తేదీన గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ జరుపనుంది. తొక్కిసలాటకు దారితీసిన కారణాలు, బాధ్యులను గుర్తించనుంది కమిషన్. ఏర్పాట్లలో లోపాలు, అనుమతుల ఉల్లంఘన జరిగితే దానికి కారణమైన వారిని గుర్తించనుంది కమిషన్. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న నిబంధనలు, అనుమతులకు అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూచనలు చేయనుంది కమిషన్. ఈ కమిషన్ నెల రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..