
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ అజ్ఞాతం వీడారు. ఇవాళ్టి నుంచే పోలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కి బైబై కూడా చెప్పేశారాయన. కిరణ్ పార్టీ మారబోతున్న విషయాన్ని మొదట టీవీ9 బయటపెట్టింది. మార్చి 11న టీవీ9 ఫస్ట్ న్యూస్ ప్లే చేసింది. మార్చి 12న ఆయన కాంగ్రెస్‌కి రాజీనామా చేశారు. ఇక ఇవాళ నడ్డా మసక్షంలో బీజేపీలో చేరబోతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి సీఎంగా, అంతకుముందు స్పీకర్‌గా పనిచేశారు కిరణ్. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌కు దూరంగా వెళ్లి సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆపార్టీకి పూర్వ వైభవం తెస్తారని ఆశించినా.. ఎందుకో అంటీముట్టనట్లుగా ఉన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కిరణ్.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌కి రెండోసారి రాజీనామా చేసి బీజేపీలో చేరి.. పొలిటికల్ స్పీడ్ పెంచబోతున్నారు.
బీజేపీ అధిష్టానంతో అనేకసార్లు చర్చలు జరిపారు కిరణ్ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో ఆయనకు కీలక పదవికి అప్పగించేందుకు బీజేపీ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..