Heavy rains: ఏపీ సరిహద్దు రాష్ట్రం ఒరిస్సాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలో వరద ఉధృతి పెరిగింది. వంశధార నదికి వరద పోటు కారణంగా హిరమండలం వద్ద గొట్టా బ్యారేజ్ కు భారీగా వరదనీరు వచ్చిచేరుతో౦ది. దీ౦తో 82వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు అధికారులు. వరద ఉధృతి నేపథ్యంలో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. వర్షాలకు తోడు ఒరిస్సా లోని రెండు మినీ రిజర్వాయర్ల నుండి నీటిని విడుదల చేయడంతో ఒక్కసారిగా గొట్టా బ్యారేజ్ కు నీటిమట్టం పెరిగింది. మ౦గళవారం మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంద౦టున్నారు అధికారులు.
వంశధార వరద ఉద్ధృతి కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, హిరమండలం L.N.పేట మండలాలలోని నదీ తీర ప్రాంతంలోని కొంతమేర పంట పొలాలు నీటమునిగాయి. కొత్తూరు మండలం మాతలి వద్ద రహదారి పైనుంచి వరదనీరు ప్రవహిస్తుండటంతో ఒడిశా, ఆంధ్రా రాష్ర్టాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుగోటి వాట గ్రామం చుట్టూ వరద నీరు చేరటంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.