AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers: రైతులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి రూ.6 వేలు..

ఏపీ రైతులకు చివరి ఛాన్స్. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్నదాత సుఖీభవ డబ్బులను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2,675 కోట్లు విడుదల చేసింది. ఇవి మీకు అందకపోతే మార్చి 31లోగా ఈ పని చేయండి

Farmers: రైతులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. మార్చి 31లోగా ఈ పని చేస్తే అకౌంట్లోకి రూ.6 వేలు..
Pm Kisan Scheme
Venkatrao Lella
|

Updated on: Mar 22, 2026 | 1:12 PM

Share

ఏపీలోని రైతులకు బిగ్ అలర్ట్. కూటమి సర్కార్ గత కొద్ది రోజుల క్రితం జమ చేసిన అన్నదాత సుఖీభవ డబ్బులు మీ అకౌంట్లో పడలేదా..? మీకు అర్హత ఉన్నా బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కాలేదా..? అయితే మీరు మార్చి 31వ తేదీలోపు ఈ పని చేస్తే మీకు సొమ్ము వచ్చేస్తాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున మూడు విడతలుగా ప్రభుత్వం జమ చేస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి తొలి విడత క్రింద రూ.6 వేలు జమ చేసింది. అయితే కొన్ని సమస్యల వల్ల కొంతమంది రైతులు నిధులు అందుకోలేదు. అలాంటివారు ఈ పనులు చేయడం వల్ల మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఏం చేయాలనేది వివరంగా తెలుసుకోండి.

వీరికి డబ్బులు కట్

ఈకేవైసీ పూర్తి చేయని రైతులు, భూమికి ఆధార్ లింకింగ్ లేకపోవడం, ఎన్‌పీసీఐ యాక్టివ్‌గా ఉండకపోవడం, మైనర్ పేరిట భూములు, భూమి యజమాని మరణించినా రికార్డుల్లో పేరు మార్చకపోవడం, వారసులకు కొత్త పుస్తకాలు జారీ కాకపోవడం, వెబ్ ల్యాండ్ వివరాల్లో తప్పులు, 1బీ, ఆధార్‌లో పేర్లు వేర్వేరుగా ఉండటం, గుడి లేదా సంస్థ పేరుపై భూమి ఉండటం, జాయింట్ అకౌంట్లో ఆధార్ సీడింగ్ లేకపోవడం, పొలంలో ఇళ్లు లేదా అక్వా సాగు చేయడం, కోర్ట్ కేసులు, వారసత్వ గొడవలు వంటి కారణాలతో అన్నదాత సుఖీభవ నిధులు నిలిచిపోతాయి.

ఏం చేయాలి..?

రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ కార్యదర్శిని సంప్రదించాలి. ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ వంటివి అందించాలి. సమస్య ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. మీ సమస్యను పరిష్కరించుకుంటే మార్చి 31లోపు మీకు నిధులు జమ అవుతాయి.

స్టేటస్ చెక్ చేస్కోండి..

-https://annadathasukhibhava.ap.gov.in/ పోర్టల్‌లోకి వెళ్లండి

-మీ స్టేటస్ తెలుసుకోండి అనే ఆప్షన్ ఎంచుకోండి

-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి

-క్యాప్చా ఎంటర్ చేయండి

-సెర్చ్ బటన్ ప్రెస్ చేయండి

-రైతు వివరాలు, బ్యాంక్ అకౌంట్, పేమెంట్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి

పీఎం కిసాన్ స్టేటస్ చూస్కోండి

రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపచేస్తోంది. దీంతో పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జమ అయ్యాయి. పీఎం కిసాన్ నిధులు అందకపోతే పీఎం కిసాన్ వెబ్ సైట్లోకి వెళ్లి స్టేటస్ చేక్ చేస్కోండి.

Follow Us
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
'కోచింగ్ లేకుండా సివిల్స్ సాధ్యమే.. ఈ బుక్స్ చదవండి' UPSC టాపర్
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర