Amaravati: టీడీపీ, జనసేన అండతోనే అమరావతి రైతుల యాత్ర.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..

అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన..

Amaravati: టీడీపీ, జనసేన అండతోనే అమరావతి రైతుల యాత్ర.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి..
Mla Kodali Nani

Edited By:

Updated on: Oct 13, 2022 | 2:29 PM

అమరావతి రైతుల పాదయాత్రపై మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ప్రోద్బలంతోనే అమరావతి రైతుల యాత్ర సాగుతోందని ఆరోపించారు. ఆ రెండు పార్టీల అండతోనే అమరావతి రైతులు యాత్ర చేస్తున్నారన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసేందుకే నిర్వహిస్తున్న ఆ యాత్రను.. అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఉత్తరాంధ్ర జేఏసీ తక్షణమే కీలక నిర్ణయం తీసుకోవాలన్నారు కొడాలి.

విశాఖలో వెయ్యికోట్ల విలువైన భూములు కబ్జా చేశారన్న ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు కొడాలి నాని. అందుకు సంబంధించి ఆధారాలుంటే.. ఈడీకి, సీబీఐకి ఇవ్వాలన్నారు. ఇప్పటికే అక్కడ టీడీపీ తిమింగళాలు భారీగా దోచేసుకున్నాయని, మిగిలిందేమీ లేదనీ ఆరోపించారు నాని.

తాను టీడీపీకి అభిమానిని కాదనీ.. ఎన్టీఆర్‌ కుటుంబానికి మాత్రమే అభిమానినని చెప్పారు కొడాలి నాని. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని అన్నారు. చంద్రబాబు దగ్గర ఊడిగం చేసేవాళ్లు పనికిమాలిన విమర్శలు చేస్తే పట్టించుకోనని కొట్టిపారేశారు మాజీ మంత్రి.

అమరావతి రైతుల యాత్రపై కొడాలి నాని కామెంట్స్.. వీడియో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..