Andhra Pradesh: వారు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..

|

Feb 01, 2023 | 9:10 AM

మరోవైపు ఇటు సింహపురి వైసీపీలో ఊహించని పరిణామాలు. ఒకేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తి గళాన్ని వినిపించారు. తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

Andhra Pradesh: వారు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయం.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్..
Mla Anil Kumar
Follow us on

మరోవైపు ఇటు సింహపురి వైసీపీలో ఊహించని పరిణామాలు. ఒకేరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీపై అసంతృప్తి గళాన్ని వినిపించారు. తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ అధిష్టానం నుంచి అంతే స్పీడ్‌గా రియాక్షన్‌ వచ్చింది. మాజీ మంత్రి బాలినేని నెల్లూరుకొచ్చి చర్చలు జరిపారు. పోయే వాళ్లు పోకుండా ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్‌ ఇచ్చారు. అటు ఎమ్మెల్యే అనిల్‌ కూడా ఆనంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నెల్లూరు జిల్లా వైసీపీలో అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్న మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీని వీడటానికి సిద్ధమైపోయారు. కోటంరెడ్డి ఒక అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేస్తున్నట్లు కార్యకర్తలతో చెప్పేశారు కూడా. ఆనం మాత్రం ఇంకా వెయిట్‌ అండ్‌ సీ అన్నట్లు చూస్తున్నారు.

పార్టీలో గుర్తింపు లేకపోవడంతో ఈ మధ్యకాలంలో వీరిద్దరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. తన అనుచరులతో మాట్లాడుతూ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ఇంతకన్నా సీరియస్‌ ఆరోపణలు చేశారు. వెంకటగిరిలో రాజ్యాగేతర శక్తులు అధికారం చెలాయిస్తున్నారని ఆరోపించారు. అధికారులతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకున్న సెక్యూరిటీని సగానికి సగం తగ్గించారు. తనకు ప్రాణహాని ఉన్నా, సెక్యూరిటీ మొత్తం తీసేయమని కోరినట్లు ఆనం చెప్పారు. అంతేకాదు…ఏడాదిన్నర నుంచి తన ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని, తనను అంతం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నెల్లూరుకు వచ్చి పార్టీ నేతలతో చర్చలు జరిపారు. పార్టీని వీడటానికి సిద్ధమైన కోటంరెడ్డితో చర్చలు జరపాలని చూశారు. అయితే ఎంపీ వేమిరెడ్డిని కలిసిన కోటంరెడ్డి తన నిర్ణయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కోటంరెడ్డి, ఆనం చేసిన ట్యాపింగ్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు బాలినేని.

80 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఐదు పార్టీలు మారిన ఆనం, ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి వంచన చేరే నైజమని విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌. ఈసారి ఆనం ఎక్కడ పోటీ చేసినా..ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు అనిల్‌.

నెల్లూరు జిల్లా ఎపిసోడ్‌పై అటు అధిష్టానం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ఇక పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఉపేక్షించేది లేదన్న సంకేతాలు బలంగా పంపేందుకు ఆనం..కోటం రెడ్డిలా ధిక్కార స్వరాలు పెరగకుండా ఆల్రెడీ యాక్షన్‌లోకి దిగింది. సింహాపురిలో జరుగుతున్న పరిణామాలపై సీఎంతో చర్చించిన తర్వాత పార్టీ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..