Andhra Pradesh: ఆ భూములను లాక్కుంటాం.. ఏపీ మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..

|

Nov 03, 2021 | 4:48 PM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది ఎక‌రాల దేవాల‌యాల భూములు అన్యాక్రంతం అయ్యాయ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. భూముల లీజుల‌ను కూడా ఏళ్ల త‌ర‌బ‌డి చెల్లించ‌డం...

Andhra Pradesh: ఆ భూములను లాక్కుంటాం.. ఏపీ మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..
Vellampallii Srinivas
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది ఎక‌రాల దేవాల‌యాల భూములు అన్యాక్రంతం అయ్యాయ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. భూముల లీజుల‌ను కూడా ఏళ్ల త‌ర‌బ‌డి చెల్లించ‌డం లేద‌న్నారు. అలాంటి వారిపై చ‌ర్యలు తీసుకోవ‌డంతో పాటు భూముల‌ను వెన‌క్కి తీసుకుంటామ‌న్నారు మంత్రి స్పష్టమైన ప్రకటన చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. దేవాలయాల భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే రెండు నెల‌ల్లో వంద‌శాతం సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి భ‌ద్రత‌ను ప‌టిష్టం చేస్తామ‌న్నారు. దేవాదాయ శాఖ‌లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా విజిలెన్స్ విభాగాన్ని ప‌టిష్టం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో మాదిరిగా దేవదాయ‌ శాఖ‌లో కూడా నాడు-నేడు ద్వారా ఆల‌యాలు అభివృద్ది చేస్తామ‌ని మంత్రి చెప్పుకొచ్చారు. హిందువుల మనోభావాలకు తగ్గట్టుగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామ‌ని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. గత ప్రభుత్వం కూల్చివేసిన 9 ఆలయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇక ఆల‌యాల్లో ఆడిట్ ఇబ్బందుల తొల‌గ‌డానికి ప్రత్యేక చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని మంత్రి వెల్లంపల్లి తెలిపారు.

Also read:

Aadhaar: కేంద్రం కీలక నిర్ణయం.. ‘ఆధార్’ నిబంధనలు ఉల్లంఘిస్తే.. ఇకపై భారీ జరిమానా..

Tollywood: ఈ ఫోటోలో చిన్నది ఇప్పుడొక హీరోయిన్.. స్టార్ హీరోల సరసన నటించి బ్లాక్‌బస్టర్స్ అందుకుంది.!

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట స్పెషల్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ డేట్ మార్చుకున్న మహేష్..