Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో ఎమ్మెల్యే, సర్పంచ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామాభివృద్ధి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, గ్రామ సర్పంచ్ మధ్య వివాదం మరింత ముదిరింది. నగరం పిహెచ్‌సి విషయంలో రెండు వర్గాల మధ్య అభివృద్ధి పోరు సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. సర్పంచ్‌తో పాటు అతని అనుచరులు అడ్డుకున్నారు.
8 కోట్ల రూపాయల నిధులతో 30 పడకల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని సర్పంచ్ ప్రచారం చేసుకుంటున్నారని, ఇది మరీ విడ్డూరంగా ఉందంటూ సర్పంచ్‌పై ఎమ్మెల్యే చిట్టి బాబు మండిపడ్డారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సర్పంచ్.. తన అనుచరులతో బయటకు వచ్చి ఎమ్మెల్యే వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Also read:
Telangana Govt: 30 సంవత్సరాల కల నెరవేర్చిన సీఎం కేసీఆర్.. అంబరాన్నంటిన సంబరాలు..
Baal Aadhaar card: మీ పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్ చేయలేదా? అయితే అసలుకే మోసం రావొచ్చు..